Padma awards 2022: జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నేడు (జనవరి 25) పద్మ అవార్డులను ప్రకటించింది. ఈ ఏడాదికి గాను 128 మందికి పద్మ పురస్కారాలకు ఎంపిక చేశారు. అందులో నలుగురికి పద్మ విభూషణ్, 17 పద్మ భూషణ్, 107 పద్మ శ్రీ అవార్డులను ప్రకటించారు.
ఇటీవలే హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ కు మరణాంతరం పద్మ విభూషణ్ పురస్కారానికి ఎంపిక చేసినట్లు కేంద్రం పేర్కొంది. అలాగే పద్మ భూషణ్ పురస్కారానికి గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదేళ్ల, కాంగ్రెస్ నేత గులామ్ నబీ ఆజాద్ వంటి వారిని ఎంపిక చేసింది.
Microsoft CEO Satya Nadella, Alphabet CEO Sundar Pichai, SII MD Cyrus Poonawalla to be conferred with Padma Bhushan
Olympians Neeraj Chopra, Pramod Bhagat & Vandana Kataria, and singer Sonu Nigam to be awarded Padma Shri pic.twitter.com/J5K9aX9Qxz
— ANI (@ANI) January 25, 2022
పద్మ విభూషణ్ పురస్కార గ్రహీతలు
1) సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ (మరణాంతరం)
2) ప్రభా ఆట్రే (మహారాష్ట్ర)
3) రాధేశ్యామ్ ఖెమ్కా (ఉత్తరప్రదేశ్, మరణాంతరం)
4) కల్యాణ్ సింగ్ (ఉత్తర ప్రదేశ్, మరణాంతరం)
పద్మ భూషణ్ గ్రహీతలు
అలాగే పద్మ భూషణ్ పురస్కారాల కోసం గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదేళ్లతో పాటుగా కొవాగ్జిన్ టీకా కనిపెట్టిన భారత్ బయోటెక్ సంస్థకు చెందిన శ్రీకృష్ణ ఎల్లా, సుచిత్రా ఎల్లా కు పద్మభూషణ్ పురస్కారానికి ఎంపిక చేశారు.
అలాగే ఒలింపిక్స్ బంగారు పతక విజేత నీరజ్ చోప్రాతో పాటు తెలంగాణకు చెందిన కిన్నెర కళాకారుడు దర్శనం మొగిలయ్యను పద్మశ్రీ అవార్డుకు ఎంపిక చేశారు. ఈయనతో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యావేత్త గరికపాటి నరసింహారావు, రామచంద్రయ్య, పద్మజారెడ్డి, గోసవీడు షేక్ హసన్, డా. సుంకర వెంకట ఆదినారాయణ లకు పద్మ శ్రీ పురస్కారానికి కేంద్రం ఎంపిక చేసింది.
Also Read: Republic Day 2022 : రిపబ్లిక్ డేకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇదిగో
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.