OPS Latest Update: ఉద్యోగులకు తీపికబురు.. ఓపీఎస్‌ అమలుకు నోటిఫికేషన్

Himachal Pradesh Govt On OPS: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రెస్ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. ఓపీఎస్ అమలుకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచే అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో 1.36 లక్షల మంది ఉద్యోగులు లబ్ధిపొందనున్నారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 18, 2023, 10:15 AM IST
OPS Latest Update: ఉద్యోగులకు తీపికబురు.. ఓపీఎస్‌ అమలుకు నోటిఫికేషన్

Himachal Pradesh Govt On OPS: పాత పెన్షన్ విధానమే కావాలంటూ దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. బీజేపీయేత పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఓల్డ్ పెన్షన్ విధానం (ఓపీఎస్) విధానం అమలు చేస్తుండడంతో కేంద్ర ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెరుగుతోంది. తాజాగా మరో రాష్ట్రంలో ఓపీఎస్‌ను పునరుద్దించారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి పాత పెన్షన్ విధానం అమలు చేస్తున్నట్లు హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు సోమవారం అర్థరాత్రి అధికారిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నోటిఫికేషన్‌ జారీ చేశారు. 

గతేడాది జరిగిన ఎన్నికల సందర్భంగా ఓపీఎస్ అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ హామీ మేరకు ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పారు. ప్రభుత్వ నిర్ణయంతో 1.36 లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. ఉద్యోగులకు ఈ నెల నుంచే పాత పెన్షన్ స్కీమ్ ప్రయోజనం కలగనుంది. ఈ ఏడాది జనవరి 13న జరిగిన తొలి కేబినెట్ సమావేశంలో ఓపీఎస్‌పై నిర్ణయం తీసుకోగా.. తాజాగా దీనికి సంబంధించి నోటిఫికేషన్ వెలువడింది. 
 
పాత పెన్షన్ విధానం అమలు నిర్ణయంతో ఎన్‌పీఎస్ కింద వచ్చే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కంట్రిబ్యూషన్‌ను ఏప్రిల్ 1 నుంచి నిలిపివేస్తున్నట్లు నోటిఫికేషన్‌లో ప్రభుత్వం వెల్లడించింది. ఎన్‌పీఎస్ కింద యజమాని, ఉద్యోగి ఇద్దరూ జమ చేస్తున్న విషయం తెలిసిందే. యజమాని వాటా కింద రాష్ట్ర ప్రభుత్వాలు జమ చేస్తున్నాయి. ఇక నుంచి ఎన్‌పీఎస్ కంట్రిబ్యూషన్‌ను హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం నిలిపివేయనుంది. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పంజాబ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ ప్రభుత్వాలు ఇప్పటికే పాత పెన్షన్‌ను పునరుద్ధరించాయి. అదేవిధంగా మరికొన్ని రాష్ట్రాలు ఓపీఎస్‌పై నివేదిక ఇచ్చేందుకు కమిటీలను ఏర్పాటు చేశాయి.

Also Read:  7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే గిఫ్ట్.. త్వరలోనే మరో డీఏ పెంపు..?

కేంద్ర ప్రభుత్వం కూడా ఇటీవల ఓపీఎస్‌పై కీలక నిర్ణయం తీసుకుంది. నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పీఎస్)లో మార్పులు చేసి పాత పెన్షన్ విధానంలో ఉండే ప్రయోజనాలకు కల్పించాలని చూస్తోంది. ఈ విషయంపై ఆర్థిక శాఖ కార్యదర్శి టీవీ సోమనాథన్‌ నేతృత్వంలోని కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సిఫార్సుల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ప్రభుత్వ ఖజానాపై భారం పడకుండానే పెన్షన్ కంట్రిబ్యూషన్ ఎలా పెంచాలనే విధానంపై ఈ కమిటీ అధ్యయనం చేస్తున్నట్లు తెలుస్తోంది. 

Also Read:  Karnataka Assembly Elections 2023: బీజేపీకి భారీ షాక్.. కాంగ్రెస్‌లో చేరిన మాజీ ముఖ్యమంత్రి

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News