తమిళనాడు ( Tamilnadu ) అధికార పార్టీ అన్నాడీఎంకే ( AIADMK ) ఎవరి వశం కానుంది ? దివంగత ముఖ్యమంత్రి జయలలిత ( Ex Cm Jayalalitha ) నెచ్చెలిగా ఉన్న శశికళ ( Sasikala ) హస్తగతం చేసుకోనుందా? చిన్నమ్మకు చెక్ పెట్టడానికే పన్నీర్ సెల్వం, పళనిస్వామిలు ఏకమయ్యారా? అసలేం జరుగుతోంది?
తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. అన్నాడీఎంకే అధినేత జయలలిత మరణంతో పార్టీని ఎవరు హస్తగతం చేసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. అక్రమార్జన కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న జయలలిత నెచ్చెలి శశికళ విడుదల కానుండటంతో ఈ అంశం ఇప్పుడు మరోసారి చర్చకు దారి తీస్తోంది. జయలలిత తరువాత కొద్దొగొప్పొ ప్రజాకర్షణ ఉన్నది శశికళకే. జైలు నుంచి విడుదలై బయటికొస్తే కచ్చితంగా పార్టీ ఆమె హస్తగతం చేసుకుంటుందనే వార్తలు వస్తున్న నేపధ్యంలో అన్నాడీఎంకే ప్రస్తుత నేతలు అప్రమత్తమయ్యారు.
చిన్నమ్మకు చెక్ పెట్టడానికే రెండు వైరి వర్గాలు ఏకమయ్యాయి. మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ( Ex cm Panneer selvam ), ప్రస్తుత ముఖ్యమంత్రి పళనిస్వామిలు ( Cm Palani sami ) ఏకమై...మార్గదర్శక కమిటీ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా రానున్న ఎన్నికల్లో పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా పళని స్వామిని ఎంపిక చేశారు. ఈ విషయాన్ని స్వయంగా మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ప్రకటించడం గమనార్హం.
తాజా పరిణామాలతో తమిళనాడు అన్నాడీఎంకే కుర్చీ వివాదానికి తెరపడింది. 11 మందితో ఏర్పాటైన మార్గదర్శక కమిటీకు కన్వీనర్ గా పన్నీర్ సెల్వం వ్యవహరిస్తుండగా..కమిటీ సభ్యులంతా చిన్నమ్మకు వ్యతిరేకంగా మొదటి నుంచి గళం విప్పుతున్నవారే ఉన్నారు. శశికళకు కాస్తో కూస్తో అనుకూలంగా ఉన్నవారిని పొరపాటున కూడా కమిటీలో చేర్చుకోకుండా జాగ్రత్త పడ్డారు. ఎందుకంటే మంత్రి ఓఎస్.మణియన్, సెల్లూరు రాజుతో పాటు మరో ఇద్దరు, అన్వర్‌రాజా వంటి సీనియర్లు ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. దీనికి కారణం అప్పుడప్పుడూ చిన్నమ్మకు అనుకూలంగా వీరంతా మాట్లాడిన సందర్బాలున్నాయి. Also read: Fake universities list: 24 నకిలీ విశ్వవిద్యాలయాలను గుర్తించిన యూజీసీ
రానున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎవరు, మార్గదర్శక కమిటీ ( Coordination Committee ) లో ఎవరెవరుండాలనే దానిపై చర్చించడానికి కమిటీ కన్వీనర్ పన్నీర్ సెల్వం, కో కన్వీనర్ పళనిస్వామి నివాసాల్లో వేర్వేరుగా సుదీర్ఘ మంతనాలు సాగాయి. అనంతరం పార్టీ కార్యాలయంలో సంయుక్తంగా కలిసి సమావేశం ఏర్పాటు చేశారు. పార్టీ ప్రిసీడియం చైర్మన్ మధుసూదన్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి పన్నీరు సెల్వమ్, పళని స్వామిలు హాజరు కాగా, సంయుక్త కన్వీనర్లు, ఎంపీలు వైద్యలింగం, కేపీ మునుస్వామి నేతృత్వం వహించారు. ముందుగా పళని స్వామి అన్నాడీఎంకే మార్గదర్శక కమిటీని ప్రకటించారు. ఇందులో మంత్రులు దిండుగల్ శ్రీనివాసన్, తంగమణి, ఎస్పీ వేలుమణి, జయకుమార్, సీవీ షణ్ముగం, ఆర్ కామరాజ్‌లకు చోటు కల్పించారు. పార్టీ నిర్వాహక కార్యదర్శులు జేసీడీ ప్రభాకర్, మాజీ ఎంపీ పీహెచ్ మనోజ్ పాండియన్, మాజీ మంత్రి మోహన్, మాజీ ఎంపీ గోపాలకృష్ణన్, ఎమ్మెల్యే మాణిక్యంలకు అవకాశం కల్పించారు. వీరంతా చిన్నమ్మకు వ్యతిరేకవర్గమే. చివరిగా పార్టీ సీఎం అభ్యర్ధిగా పళని స్వామిని ఎంపిక చేస్తూ..కమిటీ కన్వీనర్ పన్నీర్ సెల్వమ్ ప్రకటించారు.
పళని స్వామిని సీఎం అభ్యర్ధిగా ప్రకటించిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా అన్నాడీఎంకే వర్గాలు సంబరాలు చేశాయి. బాణాసంచా పేల్చుతూ..స్వీట్లు పంచిపెట్టారు. పళనిస్వామిని ప్రసన్నం చేసుకునేందుకు నేతలు క్యూ కట్టారు. జైలు నుంచి బయటకు వచ్చే శశికళ.. అన్నాడీఎంకేను కైవసం చేసుకోవడం ఖాయం అన్న ప్రచారానికి మార్గదర్శక కమిటీతో చెక్ పెట్టారు పన్నీర్ సెల్వమ్, పళనిస్వామిలు. శశికళకు ఉన్నదారులన్నీ మూసేసే విధంగా చర్యలు తీసుకుని అప్రమత్తమయ్యారు అన్నాడీఎంకే నేతలు. Also read: Sasikala: చిన్నమ్మకు భారీ షాక్.. 2వేల కోట్ల ఆస్తుల జప్తు