/telugu/photo-gallery/hero-sai-durga-tej-emotional-with-his-mama-pawan-kalyan-pics-goes-viral-rv-180879 Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు 180879

దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ కలకలం సృష్టిస్తోంది. రూపం మార్చుకున్న కరోనా మహమ్మారి మరింత ప్రమాదకరంగా మారింది. మహారాష్ట్రలో ఆ వ్యక్తికి సోకింది ఓమిక్రాన్ వైరసేనా..ఆ వివరాలు పరిశీలిద్దాం.

కరోనా మహమ్మారి(Corona Pandemic) ప్రపంచాన్ని పట్టి పీడిస్తూనే ఉంది. ఇప్పటికే ఇండియాలో రెండు వేవ్‌లతో గజగజలాడించింది. ఇప్పుడు మొత్తం ప్రపంచాన్ని కరోనా కొత్తరూపు దాల్చుకుని పీడిస్తోంది. ఇంకోసారి ప్రపంచంపై దండెత్తేందుకు వస్తోంది. కరోనా వైరస్ మ్యూటేషన్ ఇసారి తీవ్రంగా మారిందని పరిశోధకులు చెబుతున్నారు. దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఒమిక్రాన్ కేసులు యూరప్ దేశాలతో పాటు ఆస్ట్రేలియాలో కూడా బయటపడ్డాయి. ఫలితంగా ఒమిక్రాన్ ముప్పుు సంక్షోభంగా మారకముందే ప్రపంచదేశాలు అప్రమత్తమవుతున్నాయి. ఇప్పటికే చాలా దేశాలు అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై ఆంక్షలు విధించాయి. దేశంలో ప్రవేశించకుండా నిర్ణయం తీసుకున్నాయి. ఇజ్రాయిల్ దేశం ఈ విషయంలో కఠినంగా వ్యవహరిస్తోంది. 

అయితే ఇండియాలో ఇప్పుడు ఒమిక్రాన్(Omicron)కలకలం రేపుతోంది. మొన్న దక్షిణాఫ్రికా నుంచి ఇండియాకు తిరిగొచ్చిన ఇద్దరు బెంగళూరు వ్యక్తులకు కరోనా సోకినట్టు తెలియడంతో అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అయితే ఆ ఇద్దరికీ సోకింది డెల్టా వేరియంట్ అని తేలడంతో ఊపిరిపీల్చుకున్నారు. ఇప్పుడు మహారాష్ట్ర విషయం ఆందోళన కల్గిస్తోంది. మహారాష్ట్ర(Maharashtra) థాణే జిల్లాకు చెందిన డోంబివిల్లిలో కరోనా కలకలం రేపుతోంది. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ఓ వ్యక్తికి కోవిడ్ 19 పాజిటివ్‌గా తేలింది. ఒక్కసారిగా అంతా ఉలిక్కిపడ్డారు. ఈ వ్యక్తికి సోకింది ఒమిక్రాన్ వైరస్‌నా కాదా అనేది ఇంకా తేలాల్సి ఉంది. ప్రస్తుతం పరీక్షల కోసం శాంపిల్‌ను ల్యాబ్ కు పంపించారు. ఆ వ్యక్తిని క్వారంటైన్‌కు తరలించారు. మరోవైపు ఒమిక్రాన్ కొత్త వేరియంట్‌ను నియంత్రించేందుకు భారత ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరికలు జారీ చేశారు. అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు నియంత్రణ, నిఘా పెంచారు. 

Also read: కార్తీకమాసంలో...ఇవాళ నవంబర్ 29 మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Section: 
English Title: 
Omicron fear in india, a man tested positive in maharashtra who returned from south africa
News Source: 
Home Title: 

దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా, దేశంలో ఒమిక్రాన్ కలకలం

దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా, దేశంలో ఒమిక్రాన్ కలకలం
Caption: 
Omicron variant ( file photo)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Highlights: 

ఇండియాలో మరోసారి  ఒమిక్రాన్ కలకలం

మహారాష్ట్రలో దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్

ఒమిక్రాన్ వైరస్‌నా కాదా అనేది తేల్చేందుకు పరీక్షలు

Mobile Title: 
దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా, దేశంలో ఒమిక్రాన్ కలకలం
Md. Abdul Rehaman
Publish Later: 
No
Publish At: 
Monday, November 29, 2021 - 06:16
Created By: 
Md. Abdul Rehaman
Updated By: 
Md. Abdul Rehaman
Published By: 
Md. Abdul Rehaman
Request Count: 
93
Is Breaking News: 
No