Black Friday: ఒడిశా రైలు ప్రమాదంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరుగుతోంది. కోరమాండ్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం ఇదే రాష్ట్రంలో 14 ఏళ్ల క్రితం జరిగిన నాటి కోరమాండల్ రైలు ప్రమాదాన్ని జ్ఞాపకం చేస్తోంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..
ఒడిశాలో బహానగ బజార్ రైల్వే స్టేషన్ సమీపంలో ఆగి ఉన్న గూడ్స్ రైలును షాలిమార్ నుంచి చెన్నై వెళ్తున్న కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ అత్యంత వేగంగా ఢీ కొట్టింది. దాంతో 7-8 భోగీలు పట్టాలు తప్పి చెల్లాచెదురయ్యాయి. అదే సమయంలో పక్క ట్రాక్‌పై నుంచి వస్తున్న యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రైలు ఢీ కొట్టి పట్టాలు తప్పింది. దాంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగింది. ఈ ఘటనలో ఇప్పటి వరకూ దాదాపు 300 మంది ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. 1000 మంది వరకూ వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
హౌరా వైపుకు వస్తున్న యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లో 1000 మంది ప్రయాణీకులున్నట్టు తెలుస్తోంది. ఈ రైలు ప్రమాదం కారణంగా చెన్నై-హోరా మధ్య పలు రైళ్లు రద్దయ్యాయి. చెన్నై-హౌరా మధ్య దూరం 1662 కిలోమీటర్లు కాగా ప్రయాణ కాలం 27 గంటలు. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ గరిష్ట వేగం గంటకు 130 కిలోమీటర్లు. నిన్న జూన్ 2వ తేదీ శుక్రవారం జరిగిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం సరిగ్గా 14 ఏళ్ల క్రితం 2009లో జరిగిన నాటి కోరమాండల్ రైలు ప్రమాదాన్ని గుర్తు చేస్తోంది.
2009 ఫిబ్రవరి 13 వతేదీన అప్పుడు కూడా శుక్రవారం నాడే ఇదే కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ఇదే రాష్ట్రంలోని జాజ్‌పూర్ జిల్లాలో పట్టాలు తప్పి ప్రమాదానికి లోనైంది. ఈ ప్రమాదంలో 13 భోగీలు పట్టాలు తప్పాయి. నాటి ఈ ప్రమాదంలో 16 మంది మరణించగా 161 మందికి గాయాలయ్యాయి. నాటి కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం కూడా సాయంత్రం 7.30-7.40 గంటల మధ్య జరిగింది. నాడు ఈ ప్రమాదంలో శుక్రవారం కాస్తా బ్లాక్ ఫ్రైడే అయింది.
నాడు-నేడు అదే కోరమాండల్ ఎక్స్‌ప్రెస్
2009 ఫిబ్రవరి 13 ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లా జైపూర్ రోడ్ రైల్వేస్టేషన్ సమయం సాయంత్రం 7.30 గంటలు కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ శుక్రవారం రోజు
14 ఏళ్ల తరువాత 2023లో ఒడిశాలోని బాలాసోర్ సమీపంలోని బహానగ బజార్ రైల్వేస్టేషన్ ప్రాంతంలో కోరమాండల్, యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు, గూడ్స్ రైలుకు ప్రమాదం, సమయం సాయంత్రం 6.55 గంటలకు. శుక్రవారం సాయంత్రం. నాడు 16 మంది మరణిస్తే నేడు 300 మంది ప్రాణాలు కోల్పోయారు.
Also read: Odisha Accident Tragedy: కొడుకు బతికున్నాడా లేడా, మృతదేహాల కుప్పలో వెతుకుతున్న ఓ తండ్రి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Black Friday: మరో బ్లాక్ ఫ్రైడే, 14 ఏళ్ల క్రితం కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదం