పాఠశాల సెలవుల కోసం మంచినీటిలో పురుగు మందు కలిపిన విద్యార్థి.. 19 మందికి అస్వస్థత

Odisha Student Mixes Pesticide in Water to Force School Closure: కొవిడ్ కొత్త వేరియంట్ వ్యాప్తితో లాక్​డౌన్​ వస్తుందని సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం జరిగింది. దీనితో పాఠశాలకు సెలవులు వస్తాయని భావించాడో విద్యార్థి. అయితే ఈ వార్తలన్నీ ఫేక్​ అని ప్రిన్సిపల్ ప్రకటించాడు. దీనితో పాఠశాలకు ఎలాగైనా సెలవులు కావాలనుకున్న ఆ విద్యార్థి తీసుకున్న ఓ నిర్ణయం.. 19 మంది స్టూడెంట్స్ ను ఆసుపత్రిపాలు చేసింది. ఇంతకీ ఆ విద్యార్థి ఏం చేశాడంటే..?

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 12, 2021, 08:49 AM IST
    • ఒడిశాలోని కామ్ గావ్ ఉన్నతవిద్య పాఠశాలలో దారుణం
    • సెలవుల కోసం మంచినీటిలో పురుగు మందు కలిపిన విద్యార్థి
    • కలుషిత నీటిని తాగి 19 మంది విద్యార్థులకు అస్వస్థత
పాఠశాల సెలవుల కోసం మంచినీటిలో పురుగు మందు కలిపిన విద్యార్థి.. 19 మందికి అస్వస్థత

Odisha Student Mixes Pesticide in Water to Force School Closure: ఒడిశాలోని బార్​గఢ్​ జిల్లాలో ఆశ్చర్య ఘటన జరిగింది. స్కూల్ కు సెలవులు ప్రకటించాలనే ఉద్దేశంతో 11వ తరగతికి చెందిన హాస్టల్‌ విద్యార్థి మంచినీటిలో పురుగు మందు కలిపాడు. అలా చేయడం సహా తోటి విద్యార్థులతో ఆ కలుషిత నీటిని తాగించాడు.

పురుగుల మందు కలిపిన నీళ్లు తాగిన 11, 12వ తరగతులకు చెందిన 19 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. పాఠశాల సిబ్బంది వెంటనే వారందరిని ఆసుపత్రి తరలించారు.

ఏం జరిగిందంటే?

ఒడిశాలోని బార్​గఢ్ జిల్లా నువాపల్లికి చెందిన విద్యార్థి కామ్‌గావ్ పాఠశాలలో 11వ తరగతి చదువుతున్నాడు. కొవిడ్‌ కేసులు మళ్లీ పెరుగుతుండటం వల్ల డిసెంబర్ 19 నుంచి ఒడిశాలో లాక్‌డౌన్ విధిస్తారంటూ సామాజిక మాధ్యమాల్లో ఓ వార్త వైరల్​గా మారింది.

ఆ వార్తలను నిజమని నమ్మిన సదరు విద్యార్థి పాఠశాలను మూసేస్తే ఇంటికి వెళ్లొచ్చని సంబరపడ్డాడు. కానీ లాక్​డౌన్​ లాంటిది ఏమీ లేదని.. సెలవులు రావని తెలుసుకుని కలత చెందాడు. అయినప్పటికీ పాఠశాలను ఎలాగైనా మూసేసేలా చేస్తానని స్నేహితుల వద్ద చెబుతుండేవాడు.

ఈ క్రమంలోనే సదరు విద్యార్థి డిసెంబర్ 8న వాటర్‌ బాటిల్‌లో పురుగుమందు కలిపి హాస్టల్​లోని తన స్నేహితులకు అందించాడు. అవి తాగిన 19 మంది ఒంట్లో వికారంగా ఉండటం, కళ్లు తిరగడంతోపాటు వాంతులు చేసుకున్నారు.

సమాచారం అందుకున్న హాస్టల్​ సిబ్బంది.. విద్యార్థులను కామ్‌గావ్ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడినుంచి జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స అందించిన వైద్యులు ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉందని ప్రకటించారు. వారిని పరిశీలనలో ఉంచామని పేర్కొన్నారు. ఈ ఘటనపై స్పందించిన పాఠశాల ప్రిన్సిపల్ ప్రేమానంద పటేల్.. సదరు బాలుడిపై చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.    

Also Read: Gas Leak in Erode: రసాయన పరిశ్రమలో లీకైన విషవాయువు...ఒకరు మృతి, 13 మంది పరిస్థితి విషమం..

Also Read: Two Farmers Killed : నిరసన ప్రాంతం నుంచి ఇంటికి తిరిగొస్తుండగా ఇద్దరు రైతుల మృతి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News