NTPC Jobs 2021: ఎన్టీపీసీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్.. అప్లై చేయండిలా Direct link to apply

NTPC jobs notification 2021 for Engineering Executive Trainees: ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రూమెంటేషన్ విభాగాల్లో ఉత్తీర్ణులైన ఇంజనీరింగ్ గ్రాడ్యూయేట్స్‌కి గుడ్ న్యూస్. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్‌లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ట్రైనీ పోస్టుల నియామకానికి నోటిఫికేషన్  (NTPC jobs notification) వెలువడింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 8, 2021, 05:15 AM IST
NTPC Jobs 2021: ఎన్టీపీసీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్.. అప్లై చేయండిలా Direct link to apply

NTPC jobs notification 2021 for Engineering Executive Trainees: ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రూమెంటేషన్ విభాగాల్లో ఉత్తీర్ణులైన ఇంజనీరింగ్ గ్రాడ్యూయేట్స్‌కి గుడ్ న్యూస్. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్‌లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ట్రైనీ పోస్టుల నియామకానికి నోటిఫికేషన్  (NTPC jobs notification) వెలువడింది. ఎన్టీపీసీ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం 280 ఖాళీలు భర్తీ చేయనున్నారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ట్రైనీ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఎన్టీపీసీ అధికారిక వెబ్‌సైట్- https://www.ntpccareers.net/openings.php లోకి లాగాన్ అవడం ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు.

Last date to apply: దరఖాస్తుకు చివరి తేదీ ?
NTPC నోటిఫికేషన్‌లో వెల్లడించిన వివరాల ప్రకారం మే 21 నుంచే దరఖాస్తుకు వీలు కల్పించగా.. మరో రెండు రోజుల్లో తుది గడువు ముగియనుంది. అంటే జూన్ 10 వరకు మాత్రమే అభ్యర్థులకు దరఖాస్తు చేసుకోవడానికి వీలు ఉంది.  

NTPC jobs కి ఎవరెవరు అర్హులు ?
గేట్ 2021 ఎగ్జామ్ స్కోర్ (GATE 2021 Exam score) ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనుండటం అనేది తొలి ప్రామాణికం కాగా... పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ చెక్ చేయగలరు.

Age limit వయో పరిమితి..
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 21 సంవత్సరాలు నుంచి 27 ఏళ్లలోపు వారు అయి ఉండాలి. రిజర్వేషన్ నిబంధనల ప్రకారం వయో పరిమితిలో సడలింపు ఇవ్వడం జరుగుతుంది. 

How to apply.. ఎలా దరఖాస్తు చేసుకోవాలి ?
ఎన్టీపీసీ అధికారిక వెబ్‌సైట్ హోమ్ పేజీలో కెరీర్ ( NTPC Careers) బటన్‌పై క్లిక్ చేస్తే.. అక్కడ జాబ్స్ ఎట్ ఎన్టీపీసీ (Jobs at NTPC) అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ బటన్ క్లిక్ చేస్తే.. సంబంధింత నోటిఫికేషన్ లింక్ ఓపెన్ అవుతుంది. ఆ నోటిఫికేషన్ కిందే క్లిక్ టు అప్లై ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్ క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు సబ్మిట్ చేయడం ద్వారా అప్లై చేసుకోవచ్చు. 

నోటిఫికేషన్ వివరాలు, ఆన్‌లైన్ అప్లికేషన్ వివరాల కోసం డైరెక్ట్ లింక్ ఇదిగో

NTPC jobs direct link: ntpccareers.net/openings.php

Trending News