మేఘాలయలో బీజేపీ, ఎన్‌పీపీ దోస్తీతో ప్రభుత్వం ఏర్పాటు..!

మేఘాలయలో ఎట్టకేలకు ప్రభుత్వం ఎవరు ఎలా నెలకొల్పాలన్న విషయంలో క్లారిటీ వచ్చింది.

Last Updated : Mar 5, 2018, 07:02 PM IST
మేఘాలయలో బీజేపీ, ఎన్‌పీపీ దోస్తీతో ప్రభుత్వం ఏర్పాటు..!

మేఘాలయలో ఎట్టకేలకు ప్రభుత్వం ఎవరు ఎలా నెలకొల్పాలన్న విషయంలో క్లారిటీ వచ్చింది. 19 స్థానాలు కలిగిన ఎన్‌పీపీ, 2 సీట్లు ఉన్న బీజేపీకి మద్దతివ్వడానికి ముందుకొచ్చింది.  ఎన్‌పీపీ నేత కన్రాడ్ సంగ్మా సీఎం పీఠాన్ని కొద్ది రోజుల్లో అధిష్టించనున్నారు. ఎన్నికల్లో  6 సీట్లు గెలుచుకున్న యూడీపీ, 21 సీట్లు కైవసం చేసుకున్న కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వకుండా, బీజేపీ-ఎన్‌పీపీ పక్షాలకు మద్దతివ్వడానికి నిర్ణయం తీసుకోవడంతో ఎట్టకేలకు ఏమవుతుందోనని ఆసక్తిగా ఎదురుచూసిన ప్రజల సందేహానికి తెరపడింది. ముఖ్యంగా కాంగ్రెస్ గట్టిపోటీ ఇచ్చి అత్యధిక స్థానాలు కైవసం చేసుకున్నా.. ఎన్‌పీపీ బీజేపీ వైపే మొగ్గుచూపడంతో పరిస్థితి తలకిందులైంది. 

Trending News