రైల్లో బెర్త్ ఖరారయ్యే అవకాశాలపై సమాచారం

వెయింటింగ్ లిస్టులో ఉన్న బెర్తులు ఖరారాయే అవకాశం ఏ మేరకు ఉందనేదానిపై ప్రయాణీకులకు ఐఆర్‌సీటీసీ స్వయంగా సమాచారం అందిస్తోంది.

Last Updated : May 29, 2018, 11:43 AM IST
రైల్లో బెర్త్ ఖరారయ్యే అవకాశాలపై సమాచారం

వెయింటింగ్ లిస్టులో ఉన్న బెర్తులు ఖరారాయే అవకాశం ఏ మేరకు ఉందనేదానిపై ప్రయాణీకులకు ఐఆర్‌సీటీసీ స్వయంగా సమాచారం అందిస్తోంది. ఇప్పటివరకు కొన్ని ప్రవేట్ సంస్థలు మాత్రమే విశ్లేషించి సమాచారం ఇస్తుండగా.. సోమవారం అర్థరాత్రి నుంచి ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లోనూ ఈ సౌకర్యం లభిస్తోంది. టికెట్ల బుకింగ్, రద్దుకు సంబంధించి 13 ఏళ్ల సమాచారం సేకరించి, వాటి ఆధారంగా బెర్త్ ఖరారయ్యే అవకాశాన్ని నిర్ణయించేలా టెక్నాలజీని రూపొందించింది. ప్రస్తుతం ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో రోజుకు దాదాపు 13 లక్షల టికెట్లు బుక్‌ అవుతున్నాయి.

మరోవైపు రైళ్ల ఆలస్యానికి గల కారణాలను అన్ని రైల్వేస్టేషన్లలోని ప్లాట్‌ఫాం తెరలపై వీడియో రూపంలో ప్రదర్శించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. రైలు ఆలస్యానికి గల కారణాలను వీడియోలో వివరిస్తారు. ఆలస్యానికి ప్రయాణికులకు క్షమాపణ చెప్తారు. ప్రస్తుతం దేశంలో 30శాతం రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయని రైల్వే శాఖ నివేదికలో పేర్కొన్నారు.

Trending News