కరోనాను జయించిన మరో రాష్ట్రం

దేశంలో కరోనా వైరస్ కేసులు శరవేగంగా పెరిగిపోతున్నాయి. లాక్‌డౌన్ అమలుచేస్తున్నా కోవిడ్19 కేసులతో పాటు మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. (Corona Free State) 

Written by - Shankar Dukanam | Last Updated : Apr 24, 2020, 09:31 AM IST
కరోనాను జయించిన మరో రాష్ట్రం

శుభవార్త. దేశంలో మరో రాష్ట్రం కరోనా విముక్త రాష్ట్రంగా మారింది. ఇటీవల గోవా రాష్ట్రం కరోనా రహిత రాష్ట్రంగా మారింది. తాజాగా ఈ జాబితాలోకి ఈశాన్య రాష్ట్రం చేరింది. త్రిపురం కరోనా వైరస్ లేని రాష్ట్రంగా ప్రకటించారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో ఇద్దరు వ్యక్తులకు కరోనా సోకడం తెలిసిందే.  ఆ మహిళ సేఫ్.. 19సార్లు పాజిటివ్.. 20వ టెస్టులో ఊరట 

అయితే వారికి కొన్ని రోజులుగా కోవిడ్19 చికిత్స అందించారు. ఈ క్రమంలో ఇద్దరు పేషెంట్లు కోలుకుని కరోనా మహమ్మారి నుంచి బయటపడ్డారు. దీంతో త్రిపుర రాష్ట్రం కరోనా రహిత రాష్ట్రంగా మారింది. త్రిపుర కరోనా లేని రాష్ట్రంగా నిలవడంతో ముఖ్యమంత్రి విప్లవ్ కుమార్ దేవ్ హర్షం వ్యక్తం చేశారు.   బ్రేక్‌ఫాస్ట్ ఎక్కువగా తింటే ఎన్ని లాభాలో!

కాగా, త్రిపురతో పాటు గోవా, సిక్కిం, నాగాలాండ్, మిజోరం, లక్షద్వీప్, డామన్ డయ్యూ, దాద్రా, నగర్ హవేలీలు కరోనా ఫ్రీ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలుగా నిలిచాయి. పలు రాష్ట్రాలు కరోనా టెస్టులు వేగవంతం చేశాయి. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు లాక్‌‌డౌన్‌ను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నాయి.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Photos: నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు!

 ‘అల వైకుంఠపురములో’ భామ Hot Photos

Trending News