మే 4 నుంచి విమాన సర్వీసులు.. మంత్రి ఏమన్నారంటే!

మే 4నుంచి విమాన సర్వీసులు ప్రారంభమవుతాయని కొందరు ప్రయాణికులు టూర్‌ ప్లాన్‌ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ స్పందించింది. (Resuming flight services in India)

Last Updated : Apr 19, 2020, 06:37 AM IST
మే 4 నుంచి విమాన సర్వీసులు.. మంత్రి ఏమన్నారంటే!

భారత్‌లో లాక్‌డౌన్‌ నేపథ్యంలో రైలు, విమాన ఇతరత్రా రవాణా సౌకర్యాలను తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. మే 3వరకు లాక్‌డౌన్‌ కొనసాగనుంది. దీంతో మే 4నుంచి విమాన సర్వీసులు ప్రారంభమవుతాయని కొందరు ప్రయాణికులు తమ టూర్‌ ప్లాన్‌ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ స్పందించింది. ఆమె అందాలకు నెటిజన్లు LockDown 

దేశీయ, అంతార్జాతీయ విమాన సర్వీసులను పునరుద్ధరించడంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని శనివారం స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం తమ నిర్ణయాన్ని వెల్లడించిన అనంతరం ఎయిర్‌ లైన్స్‌ సంస్థలు టిక్కెట్ల బుకింగ్‌ ప్రారంభించాలని సైతం సంబంధిత శాఖ మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పూరీ ట్వీట్‌ చేశారు.  అక్కడబ్బాయి.. ఇక్కడమ్మాయి.. వాట్సాప్‌లో పెళ్లి!

మే 3వ తేదీ వరకు ఫ్లైట్‌ టిక్కెట్లు బుక్‌ చేసుకున్న ప్రయాణికులకు మొత్తం ఛార్జీలు రీఫండ్‌ చేయనున్నట్లు ఆ శాఖ తెలిపింది. మార్చి 25 నుంచి మే3 వరకు బుక్‌ చేసుకున్న టికెట్లను రద్దు చేసుకోకున్నా మొత్తం నగదును ప్రయాణికులు ఖాతాలకు జమ చేయనున్నట్లు పేర్కొంది. ఒకవేళ ప్రయాణికులు ఎవరైనా తమ టికెట్‌ను క్యాన్సిల్‌ చేసుకుంటే గరిష్టంగా 3 వారాల వ్యవధిలో మొత్తం ఛార్జీలు ప్యాసింజర్‌కు జమ చేయాలని ఎయిర్‌ లైన్స్‌కు ఆ శాఖ సూచించింది.  Photos: నిఖిల్ కుమారస్వామి పెళ్లి వేడుక ఫొటోలు

కాగా, విమాన సం‍స్థలు మాత్రం క్యాష్‌ రిజర్వ్‌గా ఉంటుందని, నిర్ణీత కాలంలో ప్రయాణికులు ఎప్పుడైనా ఈ నగదుతో టికెట్‌ బుక్‌ చేసుకోవచ్చునని ప్రకటించడం వారిని ఆందోళనకు గురిచేస్తోంది. రద్దు చేసుకున్న టిక్కెట్లకు క్రెడిట్‌ వాచర్లు, కూపన్లు ప్రకటిస్తున్న ఎయిర్‌లైన్స్‌ ఏడాదికాలంలో ఎప్పుడైనా వీటిని వినియోగించుకోవచ్చునని, నగదు రీఫండ్‌ మాత్రం చేయలేమని చెబుతున్నాయని తెలిసిందే.   జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Pics: ‘అల వైకుంఠపురములో’ భామ Hot Photos

 ప్రపంచంలోనే హాట్ మోడల్ Bikini Photos

Trending News