Supreme Court: ప్రైవేట్ కంపెనీలకు భారీ రిలీఫ్..

దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ నేపథ్యంలో దేశంలోని ప్రైవేటు సంస్థలకు సుప్రీంకోర్టు భారీ రిలీఫ్ ను ఇచ్చింది. దాదాపు రెండు నెలల పాటు లాక్ డౌన్ అమలుకాగా, ఎన్నో కంపెనీలు మూత పడ్డ విషయం తెలిసిందే..

Last Updated : Jun 12, 2020, 01:49 PM IST
Supreme Court: ప్రైవేట్ కంపెనీలకు భారీ రిలీఫ్..

హైదరాబాద్: దేశవ్యాప్తంగా (Covid-19) కరోనా విజృంభణ నేపథ్యంలో దేశంలోని ప్రైవేటు సంస్థలకు (Supreme Court) సుప్రీంకోర్టు భారీ రిలీఫ్ ను ఇచ్చింది. దాదాపు రెండు నెలల పాటు లాక్ డౌన్ అమలుకాగా, ఎన్నో కంపెనీలు మూత పడ్డ విషయం తెలిసిందే.. కంపెనీలు మూతపడినప్పటికీ, మానవతా దృక్పథంతో ఉద్యోగులకు వేతనాలు చెల్లించాలని కాగా మార్చి 29న కేంద్రం తన ఆదేశాల్లో తప్పనిసరిగా వేతనాలు చెల్లించాల్సిందేనని ఆదేశించిన సంగతి తెలిసిందే. దీనిపై పలు ప్రైవేటు కంపెనీ యాజమాన్య సంస్థలు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, కీలక తీర్పు వెలువడింది.

Also Read: పెన్షనర్లకు EPFO గుడ్ న్యూస్..

ప్రైవేటు యాజమాన్య సంస్థలు వేసిన పిటిషన్ పై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం విపత్కర పరిస్థితుల్లో మూతపడిన కంపెనీలు వేతనాలు ఇవ్వకుంటే, వారిపై జూలై నెలాఖరు వరకూ ఎటువంటి చర్యలూ తీసుకోవద్దని, వేతనాలు చెల్లించే విషయంలో రాష్ట్రాల ప్రభుత్వాలు ఉద్యోగులు, యాజమాన్యాలతో చర్చలు జరిపి ఓ నిర్ణయానికి రావాలని, రాష్ట్రాల కార్మిక శాఖ కమిషనర్ల సమక్షంలో ఈ చర్చలు జరగాలని ఆదేశించింది.

Also Read: నిరంతరంగా పెరుగుతున్న పెట్రోల్ ధరలు..

ఇదే క్రమంలో కేంద్రం తన అభిప్రాయం చెప్పాలంటూ, నాలుగు వారాల సమయం ఇస్తూ, నోటీసులను జారీ చేసింది. జస్టిస్ అశోక్ భూషన్, జస్టిస్ సంజయ్ కిషన్, జస్టిస్ ఎంఆర్ షా భారత పరిశ్రమ రంగానికి కార్మికులు ఎంత ముఖ్యమో యాజమాన్యాలు కూడా అంతే ముఖ్యమని, వారి మధ్య నెలకొన్న సమస్యలను వివాదంగా చూడలేమని ఏ వివాదమూ లేకుండా 50 రోజుల వేతనంపై నిర్ణయాలు తీసుకోవాల్సి వుంది. ఈ బాధ్యతలు రాష్ట్ర ప్రభుత్వాలదేనని వ్యాఖ్యానించారు.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News