Neet UG 2022: వైద్య విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ 2022 పరీక్ష నేడు (జూలై 17) జరగనుంది. దేశవ్యాప్తంగా దాదాపు 18 లక్షల మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు. పరీక్షకు సంబంధించిన ఏర్పాట్లన్నీ ఇప్పటికే పూర్తయ్యాయి. దేశవ్యాప్తంగా 497 నగరాల్లో నీట్ పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. అంతేకాదు, భారత్ వెలుపల విదేశాల్లోనూ 14 నగరాల్లో పరీక్ష నిర్వహిస్తున్నారు. ఈ మధ్యాహ్నం 2 గం. నుంచి 5.20గం. వరకు పరీక్ష జరగనుంది. భారత్‌లో పరీక్ష రాసే విద్యార్థులకు, విదేశాల్లో పరీక్ష రాసే విద్యార్థులకు ఒకే రకమైన నిబంధనలు వర్తిస్తాయి.
విద్యార్థులు పాటించాల్సిన నిబంధనలు :
- పరీక్ష రాసే విద్యార్థులు అరగంట ముందుగా మధ్యాహ్నం 1.30 గంటలకే పరీక్షా కేంద్రం వద్దకు చేరుకోవాలి. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు.
- పరీక్షా కేంద్రానికి సాంప్రదాయ దుస్తుల్లో వచ్చే విద్యార్థులు 12.30 గంటలకే అక్కడికి చేరుకోవాలి. విద్యార్థినులను మహిళా సిబ్బంది తనిఖీ చేస్తారు.
- పొడవాటి చేతులతో ఉండే తేలికపాటి దుస్తులను ధరించవద్దు.
- తక్కువ హీల్‌తో ఉండే స్లిప్పర్స్, సాండల్స్‌ను అనుమతిస్తారు. షూస్‌ను అనుమతించరు.
- వాలెట్స్, గాగుల్స్, హ్యాండ్ బ్యాగ్స్, బెల్టు, క్యాప్స్ అనుమతించరు.
- మొబైల్, ఎలక్ట్రానిక్ డివైజ్‌లు, వాచ్, బ్రాస్‌లెట్, కెమెరా, ఆభరణాలు, లోహపు వస్తువులను అనుమతించరు.
పరీక్షా కేంద్రానికి వెంట తీసుకెళ్లాల్సిన వస్తువులు :
- విద్యార్థులు తప్పనిసరిగా నీట్ అడ్మిట్ కార్డు వెంట తీసుకెళ్లాలి. లేనిపక్షంలో లోపలికి అనుమతించరు.
- పోస్ట్ కార్డ్ సైజు ఫోటోగ్రాఫ్, ఏదేని ఐడీ ప్రూఫ్, ఒకవేళ అభ్యర్థులు వికలాంగులైతే పీడబ్ల్యూడీ సర్టిఫికెట్ వెంట తీసుకెళ్లాలి.
- ట్రాన్స్‌పరెంట్ వాటర్ బాటిల్, పర్సనల్ హ్యాండ్ శానిటైజర్ కూడా వెంట తీసుకెళ్లవచ్చు.
- పరీక్షా సమయం ముగిసేంతవరకూ అభ్యర్థులను బయటకు అనుమతించరు.
విద్యార్థుల విజ్ఞప్తి మేరకు నీట్ పరీక్షకు ఈసారి 20 నిమిషాల పాటు అదనపు సమయాన్ని ఇచ్చారు. 200 నిమిషాల్లో 200 ప్రశ్నలకు అభ్యర్థులు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. పరీక్ష నిర్వహించిన 15 రోజుల్లో కీ విడుదల చేస్తారు.
Also Read: Godavari Floods Live: అటు గవర్నర్.. ఇటు కేసీఆర్.. వరద ప్రాంతాల్లో పోటాపోటీ పర్యటన..
Also Read:
CM Kcr Aerial View: భద్రాది జిల్లాలో భారీ వర్షాలు.. సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వే రద్దు! |
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook