NEET PG Exam 2022: నీట్ పీజీ పరీక్ష వాయిదా పడే సూచనలు కన్పిస్తున్నాయి. సుప్రీంకోర్టులో నీట్ పిటీషన్‌పై విచారణ కారణంగా పరీక్ష వాయిదా పడే అవకాశాలున్నాయి.
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్ టెస్ట్ 2022 నిర్వహణ విషయమై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ సాగనుంది. నీట్ పరీక్ష మార్చ్ 12 న జరగాల్సి ఉంది. నీట్ పీజీ పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ ఆరుగురు ఎంబీబీఎస్ విద్యార్ధులు పిటీషన్ దాఖలు చేశారు. నీట్ పీజీ 2021 కౌన్సిలింగ్‌కు హాజరయ్యే విద్యార్ధుల్ని దృష్టిలో పెట్టుకుని ఈ పరీక్ష తేదీ వాయిదా కోరారు. మరోవైపు నీట్ అనేది విద్యార్ధుల ప్రయోజనాలకు విరుద్ఘంగా ఉన్నందున తమిళనాడు అసెంబ్లీలో నీట్‌కు వ్యతిరేకంగా బిల్లు పాస్ చేశారు.
మరోవైపు ఇంటర్న్‌షిప్ గడువు తేదీ కూడా పెంచాల్సిందిగా పిటీషన్‌లో విద్యార్ధులు కోరారు. ఇంటర్న్‌షిప్ పీరియడ్‌ను పూర్తి చేయలేకపోయినందున పరీక్ష రాయలేమని విద్యార్ధులు తెలిపారు. కోవిడ్ డ్యూటీలో ఉన్నందున ఇంటర్న్‌షిప్ వాయిదా పడిందనే విషయాన్ని కూడా తెలియనివ్వలేదని..ఫలితంగా పీజీ పరీక్షకు అనర్హులయ్యారనేది విద్యార్ధుల వాదనగా ఉంది. నీట్ పీజీ రెగ్యులేషన్స్ ప్రకారం పీజీ కోర్సు చేసే విద్యార్ధుల యూనిట్‌కు 30 బెడ్స్ కేటాయించాల్సి ఉంది. నీట్ పీజీ రెగ్యులేషన్స్ 2000 ను సవాలు చేస్తూ పిటీషన్ దాఖలైంది. కోవిడ్ విధుల కారణంగా వందలాదిమంది విద్యార్ధుల ఇంటర్న్‌షిప్ నిలిచిపోయింది. ఫలితంగా నీట్ పీజీ పరీక్ష (NEET PG Exam 2022) రాయలేని పరిస్థితి.
ఎంబీబీఎస్ చివరి సంవత్సరం విద్యార్ధుల సేవల్ని వినియోగించుకుంటున్నందున నీట్ పీజీ 2021 పరీక్షల్ని కనీసం నాలుగు నెలలపాటు వాయిదా వేయాలని..2021 మార్చ్ 3 వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రకటనను కూడా పిటీషనర్లు ఉదహరించారు. 2021లో తామంతా కోవిడ్ విధుల్లో ఉన్నామన్నారు. ఈ విషయాల్ని పరిగణలో తీసుకుని నీట్ పీజీ పరీక్షను వాయిదా వేయడమే కాకుండా..ఇంటర్న్‌షిప్ గడువును మే 31 నుంచి పెంచాలని కోరుతున్నారు. ఈ అంశాలపై ఇవాళ సుప్రీంకోర్టులో(Supreme Court) విచారణ జరగనుంది.
Also read: Saharanpur Gangrape: కట్టెల కోసం వెళ్లిన మహిళపై గ్యాంగ్ రేప్.. అంతటితో ఆగని దుర్మార్గులు!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook