NEET 2024 Abolish: నీట్‌కు వ్యతిరేకంగా మళ్లీ గళమెత్తిన స్టాలిన్, ప్రధాని మోదీ, 8 సీఎంలకు లేఖలు

NEET 2024 Abolish: దేశంలోని వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశానికై నిర్వహించే నీట్ పరీక్షపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మరోసారి స్పందించారు. నీట్ పరీక్ష వ్యవస్థు రద్దు చేయాలని కోరుతూ ప్రదాని నరేంద్ర మోదీ ఇతర ముఖ్యమంత్రులకు లేఖలు రాశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 29, 2024, 12:31 PM IST
NEET 2024 Abolish: నీట్‌కు వ్యతిరేకంగా మళ్లీ గళమెత్తిన స్టాలిన్, ప్రధాని మోదీ, 8 సీఎంలకు లేఖలు

NEET 2024 Abolish: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించే నీట్ పరీక్ష ఈసారి ఎంత వివాదాస్పదమైందో అందరికీ తెలిసిందే. నీట్ పరీక్ష ప్రశ్నాపత్రాల లీకేజ్, గ్రేస్ మార్కుల వ్యవహారం, అవకతవకల ఆరోపణల నేపధ్యంలో నీట్‌కు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి స్టాలిన్ మరోసారి గళం విప్పారు. 

నీట్ పరీక్షను మొదట్నించి తమిళనాడు బలంగా వ్యతిరేకిస్తోంది. నీట్ పరీక్ష 2024ను అమలు వ్యతిరేకంగా ఇప్పటికే చాలాసార్లు గళం విప్పారు స్టాలిన్. ఇప్పుడు నీట్ పరీక్షల్లో అవకతవకలు, ప్రశ్నాపత్రాల లీకేజ్, సీబీఐ దర్యాప్తు, గ్రేస్ మార్కుల వ్యవహారంతో మరోసారి స్పందించారు. నీట్ పరీక్షను జాతీయ స్థాయిలో రద్దు చేసి, ఏ రాష్ట్రాలకు ఆసక్తి ఉందో ఆ రాష్ట్రాలే నిర్వహించుకునే వెసులుబాటు కల్పించాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీ సహా 8 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాశారు. నీట్ నుంచి తమ రాష్ట్రాన్ని మినహాయించాలని కోరారు. ప్రొఫెషనల్ కోర్సుల్లో ప్రవేశాలనేవి ఇంటర్మీడియట్ లేదా 12వ తరగతి మార్కుల ఆధారంగా ఉండాలని, అప్పుడే విద్యార్ధులపై ఒత్తిడి తగ్గుతుందని స్టాలిన్ సూచించారు. నీట్ పరీక్ష నుంచి తమిళనాడును మినహాయించాలని కోరుతూ చేసిన అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానాన్ని రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించినట్టు ప్రధానికి తెలిపారు. 

ప్రధాని మోదీతో పాటు ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, జార్ఘండ్, కర్ణాటక, తెలంగాణ, కేరళ, పశ్చిమ బెంగాల్, పంజాబ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా స్టాలిన్ ఇదే అంశంపై లేఖలు రాశారు. తమ తమ రాష్ట్రాల అసెంబ్లీలో సైతం తీర్మానాలు చేయాలని కోరారు. నీట్ నుంచి తమిళనాడును మినహాయించాలనే డిమాండ్‌కు మద్దతివ్వాలని లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీని కోరారు. 

Also read: Security Bonds Auction: వారంలో రెండోసారి, హామీల అమలుకు 7 వేల కోట్ల బాండ్ల అమ్మకాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News