Coronavirus: కరోనా నిబంధనలు ఉల్లంఘించినందుకు 2 లక్షల కేసుల నమోదు

Coronavirus: కరోనా వైరస్ మహమ్మారి మరోసారి పంజా విసురుతోంది. నిబంధనలు పాటించని ప్రజలపై పోలీసులు కఠిన చర్యలకు దిగుతున్నారు. కరోనా నిబంధనలు ఉల్లంఘించారనే కారణంలో ఇప్పటి వరకూ నమోదైన కేసుల సంఖ్య ఎంతో తెలుసా..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 10, 2021, 09:00 PM IST
Coronavirus: కరోనా నిబంధనలు ఉల్లంఘించినందుకు 2 లక్షల కేసుల నమోదు

Coronavirus: కరోనా వైరస్ మహమ్మారి మరోసారి పంజా విసురుతోంది. నిబంధనలు పాటించని ప్రజలపై పోలీసులు కఠిన చర్యలకు దిగుతున్నారు. కరోనా నిబంధనలు ఉల్లంఘించారనే కారణంలో ఇప్పటి వరకూ నమోదైన కేసుల సంఖ్య ఎంతో తెలుసా..

ఓ వైపు కరోనా వైరస్‌ (Coronavirus) విజృంభిస్తోంది. అయినా సరే ప్రజలు జాగ్రత్తలు, నిబంధనలు పాటించడం లేదనేది పోలీసుల ఆరోపణ. అంతేకాదు అజాగ్రత్తగా ఉంటున్న ప్రజలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు అవవగాహన కల్పిస్తూనే..మాట వినని వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. ఆ విధంగా కరోనా నిబంధనలు పాటించని వారిపై తమిళనాడు (Tamilnadu) పోలీసులు భారీగా కేసులు నమోదు చేశారు. కరోనా నిబంధనలు ఉల్లంఘించారనే కారణంతో ఇప్పటివరకు రెండు లక్షల 36 వేల 119 కేసులు బుక్‌ చేశారు. మాస్క్‌ ధరించకపోవడం, భౌతిక దూరం విస్మరించడం, శానిటైజర్‌ వాడకపోవడం వంటి అంశాల వారీగా పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. 

ప్రజల ఆరోగ్యం కోసమే నిబంధనలు ఉన్నాయని హెచ్చరిస్తున్నా బేఖాతర్‌ చేస్తుండడంతో కేసులు నమోదు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చెన్నె పోలీస్‌ కమిషనర్‌ మహేశ్‌కుమార్‌ అగర్వాల్‌ ఈ విషయంపై మీడియాతో మాట్లాడారు. కరోనాను దత్తత తీసుకున్నట్లు కన్పిస్తోందని..హెచ్చరించారు. అంటే కరోనాను మనకై మనమే నిర్లక్ష్యం వహించి తెచ్చుకున్నామని వివరించారు. ఎన్నికలు ముగియడంతో కరోనా నిబంధనలు పాటించేలా పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మాస్క్‌ ధరించడం, భౌతిక దూరం పాటించడం, శానిటైజర్‌ వాడడం వంటివి చేయడంపై అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. అయితే కరోనా నిబంధనలు (Corona guidelines) ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్‌ హెచ్చరించారు. మాస్క్‌ ధరించని కేసులే 85 వేల 764 ఉన్నాయి.  117 కేసులు క్వారంటైన్‌ నిబంధనలు ఉల్లంఘన, ఇక భౌతిక దూరం పాటించని కేసులు ఏకంగా 1 లక్షా 50 వేల 318 ఉన్నాయి.

Also read: West Bengal Assembly Elections 2021: పశ్చిమ బెంగాల్‌లో గూండాగిరి ఇకపై చెల్లదంటున్న ప్రధాని మోదీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News