NEET 2022 Exam Date: ప్రతిష్ఠాత్మక వైద్యవిద్యా కోర్సుల్లో ప్రవేశానికై నిర్వహించే నీట్ పరీక్ష తేదీలు ఖరారయ్యాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పరీక్ష తేదీల షెడ్యూల్ ప్రకటించింది.
దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్ వైద్య కోర్సుల్లో ప్రవేశం కోసం ప్రతియేటా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నీట్ పరీక్షలు నిర్వహిస్తుంటోంది. ఈ ఏడాది అంటే 2022 నీట్ పరీక్షల ఎప్పుడు నిర్వహించేది షెడ్యూల్‌ను ఎన్టీఏ వెల్లడించింది. దేశవ్యాప్తంగా జేఈఈ పరీక్షల్ని కూడా ఎన్టీఏ నిర్వహిస్తుంటోంది. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడిన జేఈఈ పరీక్షల్ని ఎన్టీఏ మరోసారి వాయిదా వేస్తూ కొత్త షెడ్యూల్ ప్రకటించింది. దాంతోపాటే నీట్ 2022 పరీక్షల షెడ్యూల్ వెల్లడించింది.
దేశవ్యాప్తంగా జూలై 17వ తేదీ మద్యాహ్నం 2 గంటల్నించి సాయంత్రం 5 గంటల 20 నిమిషాల వరకూ నీట్ 2022 పరీక్ష ఉంటుంది. ఈ పరీక్ష నిమిత్తం ఇవాళ్టి నుంచి మే 6 వరకూ ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. దేశంలోని 543 నగరాలు, పట్టణాలతో పాటు వివిధ దేశాల్లోని కొన్ని ప్రాంతాల్లో నీట్ నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ పరీక్ష ఇంగ్లీషు, హిందీ, తెలుగు సహా 13 భాషల్లో ఉంటుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయోలజీ, జువాలజీ విభాఘాల్లో 50 మార్కుల చొప్పున 2 వందల మార్కులకు పరీక్ష ఉంటుంది. ఒక్కొక్క ప్రశ్నకు ఒక నిమిషం సమయం ఉంటుంది. దేశవ్యాప్తంగా దాదాపు 15 లక్షలమంది ఈ పరీక్ష రాస్తుంటారు. ఈ ఏడాది నుంచి నీట్ పరీక్షకు హాజరయ్యేందుకు గరిష్ట వయోపరిమితి తొలగించారు.
Also read: JEE Mains: మళ్లీ వాయిదా పడిన జేఈఈ మెయిన్స్ పరీక్షలు, తిరిగి ఎప్పుడంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook