National Herald Case: నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఇవాళ (జూన్ 13) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టోరేట్ (ఈడీ) ఎదుట విచారణకు హాజరుకానున్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కోవిడ్ బారినపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నందునా.. ఆమె విచారణకు హాజరయ్యే సూచనలు కనిపించట్లేదు. నేషనల్ హెరాల్డ్ వ్యవహారంలో మనీలాండరింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలపై సోనియా, రాహుల్‌లకు ఈడీ సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్ ఇవాళ ఢిల్లీలోని ఈడీ హెడ్ క్వార్టర్స్‌లో విచారణకు హాజరుకానున్నారు.
మరోవైపు, ఇదంతా కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని ఆరోపిస్తున్న కాంగ్రెస్ ఇవాళ నిరసనలకు సిద్ధమవుతోంది. ఇందులో బాగంగా ఢిల్లీలోని పార్టీ కార్యాలయం నుంచి ఈడీ హెడ్ క్వార్టర్స్ వరకు నిరసన ర్యాలీ చేపట్టాలని నిర్ణయించింది. ఈ ర్యాలీలో కాంగ్రెస్ ముఖ్య నేతలు, ముఖ్యమంత్రులు అశోక్ గెహ్లాట్, భూపేశ్ బాఘల్ పాల్గొననున్నారు. అయితే ఈ ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. ప్రస్తుతం ఢిల్లీలో నెలకొన్న పరిస్థితుల రీత్యా ర్యాలీకి అనుమతివ్వలేకపోతున్నామని పోలీసులు తెలిపారు.
పోలీసులు అనుమతి నిరాకరించిన నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు ర్యాలీని రద్దు చేసుకుంటారా.. లేక పోలీసుల ఆదేశాలను బేఖాతరు చేస్తూ ర్యాలీకి సిద్ధపడుతారా అన్నది ఉత్కంఠ రేకెత్తిస్తోంది. గతంలో ఇదే నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్‌లు పటియాలా కోర్టుకు హాజరైన సందర్భంలోనూ కాంగ్రెస్ శ్రేణులు ర్యాలీ నిర్వహించారు.
నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి ఆదివారం (జూన్ 12) ఆయా రాష్ట్రాల్లోని కాంగ్రెస్ నేతలు ప్రెస్ మీట్ నిర్వహించి బీజేపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం మాట్లాడుతూ.. రాహుల్, సోనియాలపై మోపిన మనీ లాండరింగ్ కేసు పూర్తిగా నిరాధారమని పేర్కొన్నారు. లక్నోలో సచిన్ పైలట్, రాయ్‌పూర్‌లో వివేక్ టంఖా, సిమ్లాలో నిరుపమ్ సంజయ్, చండీగఢ్‌లో రంజీత్ రంజన్, పాట్నాలో సయ్యద్ నజీర్, అహ్మదాబాద్‌లో పవన్ ఖేరా, డెహ్రాడూన్‌లో అల్కా లంబా ప్రెస్ మీట్స్ నిర్వహించారు. బీజేపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే రాహుల్, సోనియాలపై ఈడీని ప్రయోగించిందని... రాజకీయ లబ్ది కోసమే ఇదంతా చేస్తోందని వారు ఆరోపించారు.
Also Read: Horoscope Today June 13th : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారికి ఇవాళ అనుకోని వ్యక్తి నుంచి సాయం..
Also Read: Monsoon: తెలంగాణలో ఇక వానలే వానలు.. ఇవాళే రాష్ట్రంలోకి రుతుపవనాల ఎంట్రీ..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.