జాతీయ ఆరోగ్య సురక్ష పథకం లాంచింగ్ డేట్ డీటేల్స్

Last Updated : Feb 4, 2018, 11:59 AM IST
జాతీయ ఆరోగ్య సురక్ష పథకం లాంచింగ్ డేట్ డీటేల్స్

2018-19 ఆర్థిక సంవత్సరానికిగాను ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టిన ఎన్డీఏ సర్కార్... ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా ఈసారి జాతీయ ఆరోగ్య సురక్ష పథకంను అమలులోకి తీసుకురానున్నట్టు స్పష్టంచేసిన సంగతి తెలిసిందే. ఒక్కో నిరుపేద కుటుంబానికి ఒక్కో ఏడాదికి రూ. 5 లక్షల ఆర్థిక సహాయం అందేలా తీర్చిదిద్దిన ఈ పథకం ప్రస్తుత కేంద్ర బడ్జెట్‌లో అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. తమ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ పథకం అమలుకి ఎటువంటి అడ్డంకులు ఆటంకం కలిగించకుండా ప్రభుత్వం ఆర్థిక ప్రణాళికలు రచించుకున్నట్టు అరుణ్ జైట్లీ తెలిపారు. శనివారం జీ మీడియా గ్రూప్‌కి చెందిన జీ బిజినెస్ ఛానెల్‌కి ఎక్స్‌క్లూజీవ్ ఇంటర్వ్యూ ఇచ్చిన అరుణ్ జైట్లీ.. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న కానీ లేదా మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న కానీ జాతీయ ఆరోగ్య సురక్ష పథకాన్ని ప్రారంభించనున్నట్టు చెప్పారు.

10 కోట్ల కుటుంబాలు( 50 కోట్ల మంది లబ్ధిదారులు)కు ఈ పథకం కింద ఆర్థిక సహాయం అందేలా తమ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్టు జైట్లీ స్పష్టంచేశారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా ప్రస్తుతం వున్న జిల్లా కేంద్రాల ఆస్పత్రులని అభివృద్ధి చేయడంతోపాటు మరో 24 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ఆస్పత్రులు నిర్మించనున్నట్టు అరుణ్ జైట్లీ తేల్చిచెప్పారు. 

Trending News