National Doctors Day 2022: అందరికీ ఓ రోజు ఉంటుంది. మరి ప్రాణాల్ని కాపాడే డాక్టర్లకు లేకపోతే ఎలా. ప్రతియేటా జూలై 1 నేషనల్ డాక్టర్స్ డే. రేపు డాక్టర్స్ డే సందర్భంగా నేపధ్యం, చరిత్ర, ఏం చేయాలనేది తెలుసుకుందాం..
క్యాప్ ధరించేవారంతా సూపర్ హీరోలు కారు. కోట్ ధరించే వాళ్లంతా హీరోలు కానేకాదు. వైట్ కోట్ వేసి..చేతులకు గ్లోవ్స్ ధరించేవాళ్లు మాత్రం సూపర్ హీరోలే. ఎందుకంటే ప్రాణదాతలు. ప్రాణాల్ని కాపాడేవాళ్లు. దేవుడు తయారు చేసిన మనిషి శరీరానికి ఏదైనా సమస్య వస్తే..పరిష్కారం చేసేది వాళ్లే. ప్రపంచమంతా జరుపుకునే డాక్టర్స్ డేకు ఓ ఆసక్తికరమైన అంశం కూడా ఉంది. దేశాన్ని బట్టి డాక్టర్స్ డే తేదీ మారుతుంది. అక్కడి నేపధ్యం బట్టి. మిగిలిన రోజుల్లా ప్రపంచమంతా ఒకేరోజు లేదు. ఇండియాలో మాత్రం జూలై 1 జాతీయ వైద్యుల దినోత్సవం. తొలిసారిగా నేషనల్ డాక్టర్స్ డే జరుపుకున్నది 1991లో.
ప్రముఖ ఫిజీషియన్, పశ్చిమ బెంగాల్ రెండవ ముఖ్యమంత్రి డాక్టర్ బిధాన్ చంద్రరాయ్ పుట్టినరోజు కూడా జూలై 1 కావడం యాధృచ్ఛికం. నేషనల్ డాక్టర్స్ డే 2022 థీమ్ ఒకటుంది. అది ఫ్యామిలీ డాక్టర్స్ ఆన్ ది ఫ్రంట్ లైన్. కరోనా మహమ్మారి సమయంలో..ప్రాణాలు తెగించి..ప్రాణాలొడ్డి..మనల్ని, మన కుటుంబ సభ్యుల్ని, బంధుమిత్రుల్ని కాపాడేందుకు కరోనా వైరస్‌తో పోరాడిన వైద్యులు, నర్శులు, హెల్త్‌కేర్ వర్కర్లకు ఈ థీమ్ అంకితం. Family Doctors on the Front Line.
నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా మీరు కూడా మీకిష్టమైన లేదా మీ ఫ్యామిలీ డాక్టర్లకు విషెస్ చెప్పాలనుకుంటే మీ కోసం ఇంగ్లీషులో కొన్ని విషెస్ లేదా క్వొటేషన్స్ ఇక్కడ అందిస్తున్నాం.
Happy Doctors Day..You are the true Hero of our Universe
Wishing a very happy doctors day, thank you very much for your service to humanity, I salute you
Happy Doctors Day to the most caring doctor out there
Happy Doctors Day it always feels great to be a part of this noble profession
Hats off to the doctros for their hard word and dedication, Happy Doctors Day
Also read: IBPS Clerk 2022: నిరుద్యోగులకు శుభవార్త.. 7000లకు పైగా బ్యాంకు ఉద్యోగాలు! జులై 1 నుంచి దరఖాస్తులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.