auto driver rape women case in Mumbai: దేశఆర్థిక రాజధాని ముంబైలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఒక యువతికి ఆటో డ్రైవర్ మాయమాటలు చెప్పి బీచ్ కు తీసుకెళ్లి అత్యాచారంకు పాల్పడ్డారు. యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే.. పోలీసుల కథనం ప్రకారం.. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా నలసోపరా ఉండే సదరు యువతి.. తన కుటుంబంతో కలిసి ఉంటుంది. జన్వరి 21న ఇంట్లో గొడవలు జరగడంతో బైటకు వచ్చేసింది.
నలసోపారా రైల్వే స్టేషన్ కు చేరుకుంది. అక్కడ ఓ ఆటో డ్రైవర్ ను కలిసి తన బాధను చెప్పుకుంది. యువతి అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకున్న అతగాడు..ఆర్నాలా బీచ్ కు తీసుకెళ్లి.. పలు మార్లు అత్యాచారం చేశాడు. అనంతరం ఆమెను వదిలేసి పారిపోయాడు.
సదరు యువతి.. నలసోపారా స్టేషన్ వద్ద వదిలేశాడు. అనంతరం ఆటో డ్రైవర్ తనపై దాడికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈక్రమంలో పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సీసీ ఫుటేజీలకు జల్లెడపట్టి నిందితుడ్ని అరెస్ట్ చేశారు.
Read more: Monalisa Video: అయ్ పాయ్.. కుంభమేళను వదిలి వెళ్లిపోతున్న మోనాలీసా... ఎమోషనల్ వీడియో వైరల్..
ప్రైవేట్ భాగాల్లో సర్జికల్ బ్లేడ్, రాళ్లు..
యువతి తన ఇంట్లో ఏమంటారో అని భయపడి.. ప్రైవేటు పార్ట్ లలో రాళ్లు, సర్జికల్ బ్లెడ్ చొప్పించుకుంది. యువతి మానసికస్థితి సరిగ్గాలేదని పోలీసులు వెల్లడించారు. అంతే కాకుండా.. ఆటో డ్రైవర్ అత్యాచారం చేశాడని తెలిపారు. అయితే.. .. కానీ యువతి తన ప్రైవేటే పార్ట్ లో.. బ్లేడ్, రాళ్లు చొప్పించుకున్నట్లు తెలుస్తొంది. ఇంట్లో వాళ్ల భయానికి యువతి ఇలా డ్రామా క్రియేట్ చేసిందని విచారణలో బైటపడింది. ఈ నేపథ్యంలో పోలీసులు యువతికి ఆస్పత్రిలో టెస్టులు చేయించారు. దీనిపై ముంబైపోలీసులు లోతుగా విచారణ చేపట్టారు. ఈ ఘటన మాత్రం ముంబైలో సంచలనంగా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter