Mumbai Rains: ముంబైకి ఆరెంజ్ అలర్ట్.. పాల్ఘర్, థానేల్లో స్కూళ్లు బంద్..!

Mumbai Rains: కుండపోత వర్షాలకు మహారాష్ట్ర రాజధాని ముంబై చిగురుటాకులా వణుకుతోంది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ శుక్రవారం ముంబైకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 28, 2023, 03:30 PM IST
Mumbai Rains: ముంబైకి ఆరెంజ్ అలర్ట్.. పాల్ఘర్, థానేల్లో స్కూళ్లు బంద్..!

Orange alert for Mumbai: భారీ వ‌ర్షాల‌తో (Heavy Rains) దేశ ఆర్థిక రాజధాని ముంబై అతలాకుతలం అవుతోంది. గత కొన్ని రోజులగా కురుస్తున్న వర్షాలకు ముంబై చిగురుటాకులా వణుకుతోంది. నగరంలో శుక్రవారం ఉదయం వరకు రెడ్ అలర్ట్ కొనసాగించారు. ప్రస్తుతం ఇప్పుడు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసారు. పక్కనే ఉన్న థానే కూడా శుక్రవారం ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు. గురువారం ఉదయం 8.30 గంటల నుంచి శుక్రవారం 8.30 గంటల వరకు 223 మిమీ వర్షపాతం నమోదైనట్లు కోలాబా అబ్జర్వేటరీ పేర్కొంది. శాంటాక్రూజ్ అబ్జర్వేటరీ ప్రకారం,  145 మిమీ వర్షపాతం రికార్డు అయింది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు ముంబైలోని పలు ప్రాంతాల్లో నీటి ఎద్దడి నెలకొంది. 

ఈ కుండపోత వర్షాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) గురువారం అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది. పశ్చిమ రైల్వే సబర్బన్ రైలు సర్వీసులు నిన్న 10 నుంచి 15 నిమిషాలు ఆలస్యంగా నడిచాయి. ముంబై-పుణే ఎక్స్‌ప్రెస్ వే కంషెట్ ట‌న్నెల్ వ‌ద్ద గురువారం రాత్రి కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ‌టంతో వాహ‌నాల రాక‌పోక‌ల‌కు తీవ్ర అంత‌రాయం ఏర్పడింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు శిథిలాలను తొలిగించే ప్రయత్నం చేస్తున్నారు. గురువారం వరకు ముంబయిలో 90 శాతానికి పైగా వర్షపాతం నమోదైనట్లు ఐఎండీ పేర్కొంది.

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ నీటమునిగాయి. రహదారులు జలమయమయ్యాయి. ఇవాళ కూడా ముంబైలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ  తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని.. ఎవరికైనా అవసరమైతేనే బయటకు రావాలని బీఎంసీ అధికారులు సూచించారు. శుక్రవారం భారీ వర్షాలు కురిసే అవకాశమున్న నేపథ్యంలో మహారాష్ట్రలోని పాల్ఘర్, థానేలోని పాఠశాలలు మూసేశారు. వర్షాలకు తాంసా డ్యామ్ ప్రమాదకర స్థాయికి చేరడంతో 15 గేట్లు ఎత్తి లక్షా 65వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 

Also Read: Tomato Price hike: భారీ వర్షాల ఎఫెక్ట్.. మళ్లీ పెరిగిన టమాటా రేటు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu   

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News