MP Assembly Election Results 2023: లెక్క తప్పిన ఎగ్గిట్ పోల్స్.. భోపాల్ పీఠం మళ్లీ బీజేపీదే...

Madhya Pradesh Election Result 2023: మధ్యప్రదేశ్ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తారుమారు చేస్తూ బారీ విజయం దిశగా దూసుకుపోతుంది అధికార పార్టీ బీజేపీ. ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ ను దాటేసింది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 3, 2023, 04:45 PM IST
MP Assembly Election Results 2023: లెక్క తప్పిన ఎగ్గిట్ పోల్స్.. భోపాల్ పీఠం మళ్లీ బీజేపీదే...

Madhya Pradesh Election Result 2023 Live Updates in Telugu: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కమలం పార్టీ వికసించింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ.. ప్రత్యర్థి కాంగ్రెస్ ను చిత్తు చేస్తూ.. మెజార్టీ దిశగా దూసుకుపోతుంది. 230 శాసనసభ స్థానాలున్న మధ్యప్రదేశ్ లో అధికారంలో రావాలంటే 116 సీట్లు గెలుచుకోవాలి. బీజేపీ ఎప్పుడో మ్యాజిక్ ఫిగర్ ను దాటేసింది. ప్రస్తుతం కాషాయ పార్టీ 166 స్థానాల్లోనూ, కాంగ్రెస్ 63 స్థానాల్లో, ఇతరుల ఒక చోట ఆధిక్యంలో ఉన్నారు. రాష్ట్రంలో బీజేపీనే అధికారంలో ఉంది. తాజాగా మరోసారి పవర్ లోకి రానుండటంతో బీజేపీ నేతలు, కార్యకర్తలు మిఠాయిలు పంచుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారు. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ లీడింగ్ లో ఉన్నారు. శివరాజ్ గెలిస్తే ఆరోసారి సీఎం పీఠం ఎక్కుతారు. తాము తీసుకొచ్చిన పథకాలే విజయానికి కారణమయ్యాయని ఆయన అన్నారు.

నవంబరు 17న 230 శాసనసభ స్థానాలకు ఒకే దశ పోలింగ్ జరిగింది. రాష్ట్రంలో ఈసారి అత్యధికంగా 76.22% పోలింగ్ నమోదు అయింది. 2018లో నమోదైన 75.63% కంటే ఎక్కువ. మధ్యప్రదేశ్ లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ నెలకొంది. రాబోయే 2024 లోక్‌సభ ఎన్నికలలో బీజేపీకి గట్టి సవాలను విసిరేందుకు ప్రస్తుత ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పెట్టుకుంది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటికీ.. కేవలం 15 నెలల మాత్రమే రాష్ట్రాన్ని పాలించింది. పార్టీలో అంతర్గత విభేదాల వల్ల అధికారాన్ని కోల్పోయింది. ఈ పదిహేను నెలల కాలాన్ని మినహాయించి 2003 నుంచి బీజేపీనే అధికారంలో ఉంది. 

Also Read: Rajasthan Election Results 2023: రాజస్థాన్‌లో మ్యాజిక్ ఫిగర్ ను దాటేసి... విజయం దిశగా బీజేపీ..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News