Monkey Fever in Kerala: భారతదేశంలో మరోసారి మంకీ ఫీవర్ భయాందోళనలను రేపుతోంది. గతేడాది కర్ణాటకలో ఓ మంకీ కేసు నమోదవ్వగా.. ఇప్పుడు కేరళ రాష్ట్రంలోని వయనాడ్ లో మరో మంకీ కేసు బయపటపడింది. ఆ జిల్లాకు చెందిన పనవల్లీ గిరిజన ప్రాంతానికి చెందిన 24 ఏళ్ల యువకుడికి మంకీ ఫీవర్ సోకినట్లు అధికారులు తెలిపారు.
ఇటీవలే జ్వరంతో ఆస్పత్రిలో చేరిన ఆ యువకుడికి మంకీ ఫీవర్ లక్షణాలు కనిపించడం వల్ల.. వైద్యులు అతడికి పరీక్షలు నిర్వహించారు. అయితే అందులో మంకీ ఫీవర్ సోకినట్లు తేలింది. ప్రస్తుతం ఆ యువకుడికి చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు.
ఆ యువకుడి ఆరోగ్యం ఇప్పటి వరకు నిలకడగానే ఉందని పేర్కొన్నారు. కొత్త ఏడాది 2022లో కేరళలో మంకీ ఫీవర్ నమోదవ్వడం ఇదే తొలిసారి. దీంతో ప్రభుత్వం అధికారులను అప్రమత్తం చేసి.. తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
మంకీ ఫీవర్ అంటే?
ఇది కోతుల నుంచి మనూుషులకు సంక్రమించిన వైరల్ ఫీవర్. ప్లావివిరిడే అనే వైరస్ ద్వారా ఈ ఫీవర్ వ్యాప్తి చెందుతోంది. దీని లక్షణాలు అధిక జ్వరం, ఒళ్లు నొప్పులుగా ఉంటాయి. వీటితో పాటు డెంగీ జ్వరానికి ఉండే లక్షణాలను కలిగి ఉంటుంది. మంకీ ఫీవర్ కారణంగా 5 నుంచి 10 శాతం మరణించేందుకు అవకాశం ఉంది.
Also Read: Facebook live Suicide: లైవ్‌లోనే ఆత్మహత్యాయత్నం, ప్రధాని మోదీనే కారణమన్న వ్యాపారి!
Also Read: RBI Monetary Policy: బడ్జెట్ తర్వాత వడ్డీ రేట్లపై RBI గవర్నర్ శక్తికాంత దాస్ కీలక ప్రకటన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook