మా ఓటమికి డబ్బు, మీడియా కారణం

త్రిపురలో సీపీఎం పార్టీ అధికారం కోల్పోతుందని ఊహించలేదని ఆ రాష్ట్ర ఆపర్ధర్మ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ అన్నారు.

Last Updated : Mar 6, 2018, 10:48 AM IST
మా ఓటమికి డబ్బు, మీడియా కారణం

త్రిపురలో సీపీఎం పార్టీ అధికారం కోల్పోతుందని ఊహించలేదని ఆ రాష్ట్ర ఆపర్ధర్మ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ అన్నారు. పార్టీ పత్రిక గుణశక్తికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు బీజేపీ చేసిన ప్రయత్నాలను దేశ ప్రజలు గమనించారన్నారు.

ఈశాన్య రాష్ట్రాలకు నిధులు ఇస్తున్నట్లు చెప్తూనే.. ఉపాధి హామీ, హోసింగ్ సహా ఇతర పథకాలకు కేంద్రం నిధులు ఆపేసి 'ఆర్థిక దిగ్బంధనం' చేసిందన్నారు. అటు ఇదే సమయంలో మీడియాను ప్రభావితం చేసి తమకు వ్యతిరేకంగా ప్రజల్లోకి సమాచారం పంపించిదన్నారు. ఊహకందనంత డబ్బు, మీడియా నిరంతర దాడి వల్లే త్రిపురలో ఆధికారం కోల్పోవలసి వచ్చిందన్నారు. 'లెఫ్ట్ కార్యకర్తలపై దాడులు, లెఫ్ట్ కార్యాలయాలను తగులబెట్టడం ప్రారంభమైంది. బీజేపీకి ఓట్లేసిన ప్రజలు ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు కోరుకోవడం లేదు. త్వరలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయబోయే బీజేపీ-ఐపీఎఫ్టీ కూటమి చర్యలు చేపడుతుందని ఆశిస్తున్నాం' అని ఇంటర్వ్యూలో తెలిపారు.

Trending News