బెంగళూరులో మోదీ పరివర్తన యాత్ర విశేషాలు

బెంగుళూరులో ప్రధాని నరేంద్ర మోదీ పరివర్తన యాత్రలో భాగంగా రాష్ట్ర జనాభాని ఉద్దేశించి ప్రసంగించడానికి వచ్చారు.

Last Updated : Feb 5, 2018, 03:52 PM IST
బెంగళూరులో మోదీ పరివర్తన యాత్ర విశేషాలు

బెంగుళూరులో ప్రధాని నరేంద్ర మోదీ పరివర్తన యాత్రలో భాగంగా రాష్ట్ర జనాభాని ఉద్దేశించి ప్రసంగించడానికి వచ్చారు. ఆయనను బీజేపీ రాష్ట్ర నాయకుడు ఎడ్యూరప్ప సాదరంగా ఆహ్వానించారు. వచ్చే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నందున.. మహదాయి నది నీళ్ల పంపిణీ బీజేపీ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారే అవకాశం ఉంది. ఈ క్రమంలో గోవా-కర్ణాటకల మధ్య ఉన్న మహదాయి నీటి వివాదాన్ని పరిష్కరిస్తామని బీజేపీ ఎప్పుడో ప్రకటించింది. ఈ క్రమంలో మోదీ కర్ణాటక రావడంతో ఈ మీటింగ్ పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో  ఈ మీటింగ్‌కు సంబంధించిన ఆన్ లైన్ లైవ్ జీ ప్రేక్షకులకు ప్రత్యేకం..


4:44 PM - నరేంద్ర మోదీ ప్రసంగించడానికి వేదికపైకి విచ్చేశారు. ఆయనను రాష్ట్ర బీజేపీ నాయకులందరూ సాదరంగా ఆహ్వానించి వేదిక వరకు సాగనంపారు


4:48 PM -నరేంద్ర మోదీ రాకకు నిరసనగా కొందరు విద్యార్థులు సభా వేదిక బయట పకోడీలు అమ్మడం ప్రారంభించారు. గతంలో మోదీ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, పకోడిలు అమ్మేవారు కూడా ఉపాధి పొందుతున్నారని.. దీనిని కూడా ఉపాధిగా భావించవచ్చని చెప్పిన సంగతి తెలిసిందే. 


4:48 PM -మోదీ కన్నడంలో మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచారు. 


4:49 PM -కన్నడ ప్రజల హుషారు చూస్తుంటే ముచ్చట వేస్తుంది. త్వరలోనే ఇక్కడ కాంగ్రెస్ ఓడిపోతుంది. బీజేపీ ప్రభుత్వం ఇక్కడకు రావడానికి ఎంతో సేపు పట్టదు - నరేంద్ర మోదీ


5:01 PM - దేశ పరిస్థితులు మారుతున్నాయి. ఈ దేశానికి కాంగ్రెస్ వారి పాలన అక్కర్లేదు. రాష్ట్ర వికాసానికి బీజేపీ ప్రభుత్వం కర్ణాటకలో రావాలి అని కోరుకుంటున్నాను - నరేంద్ర మోదీ


5:05 PM - కర్ణాటకలో 1.16 కోట్లమంది నేడు బ్యాంకు అకౌంట్లు పొందారు. అలాగే 1.085 కోట్లమందికి ఉచిత విద్యుత్ కనెక్షన్ ఇవ్వడమైనది. అలాగే స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్‌లో  భాగంగా 34 లక్షల టాయిలెట్లను మా ప్రభుత్వం ఈ రాష్ట్రంలో నిర్మించింది - నరేంద్ర మోదీ


5:11 PM - ప్రస్తుతం కర్ణాటకలోని 7 లక్షల కుటుంబాలు... అలాగే దేశంలోని 4 కోట్ల కుటుంబాలు ఇప్పటికీ విద్యుత్ లేక మగ్గిపోతున్నాయి. అవి అన్నీ కాంగ్రెస్ పాలనలోని రాష్ట్రాలే - నరేంద్ర మోదీ


5:16 PM - ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు కాంగ్రెస్ పాలకులు చేసింది వ్యాపారం మాత్రమే. ఆ ప్రభుత్వం ఎలా పాలించిందో మీరే ఈ రోజు వరకూ చూశారు. కాంగ్రెస్ కేంద్రంలో ఉన్నప్పుడు కేవలం  73,000 కోట్లు మాత్రమే రాష్ట్రానికి ఇచ్చారు. కానీ మేము 2 లక్షల కోట్లు ఇచ్చాం. అయితే ఆ డబ్బులను రాష్ట్రం ఏం చేసిందో మీ రాష్ట్ర కాంగ్రెస్ పాలకులను ఓసారి అడగండి - నరేంద్ర మోదీ


5:18 PM - ఈ బడ్జెట్‌లో కర్ణాటకకు సంబంధించి ఓ సమస్యను మేము తీర్చాము. 160 కిలోమీటర్ల పొడవుతో సబ్ అర్బన్ రైల్వే నెట్‌వర్కు ఇక్కడ నిర్మించాలని భావించాము - నరేంద్ర మోదీ 


5:20  PM - బీజేపీ ప్రభుత్వానికి కర్ణాటకలో 9000 కిలోమీటర్ల వరకు నేషనల్ హైవే కట్టే ఆలోచన ఉంది. అలాగే భారతమాల పరియోజన క్రింద 35 వేల కిలోమీటర్ల వరకు రోడ్లను  5,25,000 కోట్లను ఖర్చు పెట్టి నిర్మించడానికి పూనుకుంటున్నాము - నరేంద్ర మోదీ


5:25  PM - ఈ బడ్జెట్‌లో రైతులకు తాము పండించే పంటలకు గాను కనీస ధర లభించేలా ప్రయత్నాలు చేశాము. ఎడ్యూరప్ప కూడా ఓ రైతు కుమారుడే. ఓ రైతు కొడుకు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే వారికి ఎంతో మంచి చేయగలుగుతాడు అన్నది వాస్తవం. ఆయనకు ఆ విధమైన మంచి మనసు ఉంది - నరేంద్ర మోదీ


5:28  PM - ఎప్పుడైతే పల్లెలు కూడా పట్టణాలకు పోటీకి ఇవ్వగల స్థాయికి చేరుకుంటాయో.. అప్పుడు వలసలు తగ్గిపోతాయి. ఆ విధంగా పల్లెలను మనం తయారుచేయాలి - నరేంద్ర మోదీ


5:30  PM - పండ్లు, కూరగాయలు ఉత్పత్తి చేసే రైతులను నేను "TOP" వర్గానికి చెందిన రైతులని అంటాను. TOP అంటే టోమాటో, ఆనియన్, పొటాటో.. అంటే టోమోటోలు, ఉల్లిగడ్డలు. బంగాళాదుంపలు. ఇలాంటి రైతుల కోసం మేము ఆపరేషన్ గ్రీన్ అని ఓ పథకం ప్రారంభించాము. ఒకప్పుడు పాల డైరీ అమూల్ ఎంత పెద్ద విజయం సాధించిందో.. అలాగే ఆపరేషన్ గ్రీన్  కూడా అంతే విజయం సాధిస్తుంది  - నరేంద్ర మోదీ


5:35  PM - కర్ణాటకలో చట్టం కన్నా నేరస్థులే ఎక్కువగా పనిచేస్తున్నారు. ఇక్కడ ప్రపంచ దేశాలు పెట్టుబడులు పెట్టాలని భావిస్తుంటే.. ఇక్కడ రాజకీయ నాయకులు మాత్రం హత్యలను ప్రోత్సహిస్తున్నారు. ఎప్పుడూ హత్యరాజకీయాలు చేస్తుంటే ఎవరొస్తారు. ఎదిరించే అమాయకులు పిట్టల్లా రాలిపోతున్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి రాష్ట్ర ప్రభుత్వం పట్ల మనం సిగ్గుపడాలి - నరేంద్ర మోదీ


5:35  PM -నా అభిప్రాయంలో హవాయి చెప్పులు వేసుకొనే సామాన్యుడు కూడా విమానం ఎక్కాలి. మా నీటిపారుదల శాఖ వారు అమలు చేస్తున్న స్కీములు రైతులకు ఎంతగానో ఉపయోగపడతాయి. మార్పు కోసమే మా ప్రయత్నం. మీది ఎంత చిన్న సమస్య అయినా మేము తీరుస్తాము.  - నరేంద్ర మోదీ


5:40 PM - ఈ మధ్య కాలంలో నా వద్దకు కర్ణాటకలో కాంగ్రెస్ పాలకులు చేస్తున్న దారుణాల గురించి సమాచారం వచ్చింది.  ఈ ప్రభుత్వాన్ని 10 పర్సెంట్ ప్రభుత్వం అంటారట. అంటే కనీసం 10 శాతం కమీషన్ అయినా ప్రజల నుండి అందనిదే.. ఈ ప్రభుత్వం పనులు చేయదు అంటుంటారు - నరేంద్ర మోదీ


5:45 PM - ఉన్నతమైన సంప్రదాయాలు కర్ణాటక ప్రజల సొంతం. అలాంటి సంప్రదాయాలకు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల నష్టం వాటిల్లుతోంది - నరేంద్ర మోదీ


5:48 PM - నిన్నే భారత అండర్ 19 జట్టు క్రికెట్ ప్రపంచ కప్ గెలిచింది. రాహుల్ ద్రావిడ్ లాంటి గొప్ప కోచ్ లేకపోతే ఇది సాధ్యం అయ్యేది కాదు. ఆయన నుండి మనం ఇచ్చిన పనిని ఎంత నిజాయతీగా చేయాలో నేర్చుకోవాలి - నరేంద్ర మోదీ


5:50 PM - పేద, మధ్యతరగతి కుటుంబాలన్నిటికీ ఇళ్లు కట్టివ్వాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యం. ఇప్పటికే 3.36 లక్షల ఇండ్లను పీఎం ఆవాస్ యోజన క్రింద మేము కట్టించి ఇచ్చాం. కానీ మేము అంత చేసిన.. కర్ణాటకలో 38,000 ఇండ్లే పూర్తి అయ్యాయి. అదీ ఇక్కడ ప్రభుత్వ వైఫల్యం - నరేంద్ర మోదీ


5:55 PM - కాంగ్రెస్ పార్లమెంటులో ట్రిపుల్ తలాక్ బిల్లు రాకుండా చేస్తోంది. ఓబీసీ బిల్లు అమలు కూడా ఆపడానికి ఆ పార్టీ చూస్తోంది. బీజేపీ అంటేనే అభివృద్దికి సూచిక. కాంగ్రెస్ అంటేనే అవినీతికి, వారసత్వ రాజకీయాలకు ప్రతీక - నరేంద్ర మోదీ


Trending News