ద్రావిడ మున్నేట్ర కజగం(DMK) అధినేత ఎంకే స్టాలిన్ తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. చెన్నైలోని రాజ్‌భవన్‌లో శుక్రవారం ఉదయం స్టాలిన్ సహా 34 మంది కేబినెట్ మంత్రులుగా ప్రమాణం చేశారు. తమిళనాడు 14వ ముఖ్యమంత్రిగా ఎంకే స్టాలిన్ చేత తమిళనాడు గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ ప్రమాణం చేయించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమి ఘనవిజయం సాధించింది.
ఎంకే స్టాలిన్ కొత్త ప్రభుత్వంలో 19 మంది పాత మంత్రులకు మరోసారి అవకాశం ఇవ్వగా, 15 మంది కొత్తవారికి కేబినెట్‌లో చోటు కల్పించి తనదైన మార్క్ చూపించారు. కేబినెట్‌లోని మొత్తం 34 మంది మంత్రులలో ఇద్దరు మహిళలున్నారు. స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్‌కు అనూహ్యంగా తమిళనాడు కేబినెట్‌లో చోటు దక్కలేదు. సీఎం స్టాలిన్(Tamil Nadu CM MK Stalin) హోంశాఖ, సాధారణ పరిపాలన, ప్రత్యేక కార్యక్రమాల అమలు, దివ్యాంగుల సంక్షేమం లాంటి శాఖల బాధ్యతలు తీసుకున్నారు.
Also Read: Gold Price In Hyderabad 07 May 2021: బంగారం కొనుగోలుదారులకు షాక్, మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు
Chennai: DMK Chief MK Stalin takes oath as the Chief Minister of Tamil Nadu.
He is being administered the oath by Governor Banwarilal Purohit pic.twitter.com/e8IZT1aNFz
— ANI (@ANI) May 7, 2021
చెన్నై మాజీ మేయర్ ఎంఏ సుబ్రమణ్యానికి వైద్య మరియు కుటుంబ సంక్షేమం, డీఎంకే ప్రధాన కార్యదర్శి ఎస్ దురైమురుగన్‌కు జలవనరుల శాఖ, ఉదయనిధి స్టాలిన్‌కు అత్యంత సన్నిహితుడైన అన్బిల్ మహేష్ పొయ్యమోజీకి ప్రాథమిక విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. అయితే డెల్టా ప్రాంతానికి చెందిన వారిలో ఒక్కరికి కూడా మంత్రివర్గంలో చోటు దక్కకపోవడం గమనార్హం. కాగా, బుధవారం నాడు గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్‌ను కలిసిన స్టాలిన్ తాను డీఎంకే శాసనసభాపక్ష నేతగా ఎన్నికైనట్లు లేఖ సమర్పించారు. 234 అసెంబ్లీ స్థానాలు గల తమిళనాడు(Tamil Nadu) అసెంబ్లీలో డీఎంకే కూటమి 133 సీట్లతో మెజార్టీ సాధించి అధికారాన్ని కైవసం చేసుకుంది.
Also Read: AP, Telangana నుంచి ఢిల్లీకి వెళ్తున్నారా, 14 రోజుల క్వారంటైన్ తప్పనిసరి
Tamil Nadu: Along with Chief Minister MK Stalin; 33 others take oath as Cabinet Ministers of state. pic.twitter.com/co3nu8gKzd
— ANI (@ANI) May 7, 2021
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook