Heart Breaking: మైనర్ బాలిక హార్ట్ బ్రేకింగ్ సూసైడ్ నోట్-లైంగిక వేధింపులతో ఆత్మహత్య

Minor girl heart touching suicide note: చెన్నై పూనమల్లె ప్రాంతంలో నివసించే ఆ బాలిక స్థానిక ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది.  అంతకుముందు, ఆమె ఓ ప్రైవేట్ స్కూల్లో చదవగా... అక్కడ ఓ టీచర్ కొడుకు ఆమెను లైంగికంగా వేధించాడు. 

Last Updated : Dec 19, 2021, 03:43 PM IST
  • చెన్నైలో మైనర్ బాలిక ఆత్మహత్య
  • లైంగిక వేధింపులు భరించలేక బలవన్మరణం
  • ఆత్మహత్యకు ముందు హార్ట్ టచింగ్ సూసైడ్ నోట్
Heart Breaking: మైనర్ బాలిక హార్ట్ బ్రేకింగ్ సూసైడ్ నోట్-లైంగిక వేధింపులతో ఆత్మహత్య

Minor girl heart breaking suicide note: దేశంలో నిత్యం ఎక్కడో చోట మహిళలపై అత్యాచార ఘటనలు (Rape incidents), లైంగిక వేధింపుల ఘటనలు (Sexual harassment) వెలుగుచూస్తూనే ఉన్నాయి. వయసుతో సంబంధం లేకుండా పసిపిల్లలు, వృద్ద మహిళలపై కూడా కామాంధులు అఘాయిత్యాలకు తెగబడుతున్నారు. స్కూళ్లు, కాలేజీలు, పని ప్రదేశాలు ఆఖరికి ఇళ్లల్లోనూ మహిళలు లైంగిక వేధింపులకు గురవుతుండటం ఆందోళన కలిగించే అంశం. తాజాగా చెన్నైకి చెందిన ఓ బాలిక లైంగిక వేధింపులతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడింది.

చెన్నై (Chennai) పూనమల్లె ప్రాంతంలో నివసించే ఆ బాలిక స్థానిక ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది.  అంతకుముందు, ఆమె ఓ ప్రైవేట్ స్కూల్లో చదవగా... అక్కడ ఓ టీచర్ కొడుకు ఆమెను లైంగికంగా వేధించాడు. ఆ వేధింపులు (Sexual harassment) తాళలేకనే బాలికను ఆమె తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూల్ నుంచి ప్రభుత్వ పాఠశాలకు మార్చారు. అయినప్పటికీ అతని వేధింపులు ఆగకపోవడంతో బాలిక తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడింది.

ఆత్మహత్యకు ముందు సూసైడ్ నోట్ రాసి ఆమె ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. బాధితురాలి తల్లి ఆ సూసైడ్ నోట్‌ను (Suicide) గుర్తించింది. 'తల్లి గర్భం, శ్మశానం.. ఆడపిల్లకు ఈ రెండు మాత్రమే సురక్షితమైన ప్రదేశాలు..' అని సూసైడ్ నోట్‌లో ఆ బాలిక పేర్కొంది. దీన్నిబట్టి ఆ బాలిక ఎంతటి నరకం అనుభవించిందో అర్థం చేసుకోవచ్చు. బాలిక రాసిన హృద్యమైన సూసైడ్ నోట్ పలువురిని కంటతడి పెట్టిస్తోంది. బాధిత బాలిక ఫిర్యాదు మేరకు చెన్నై (Chennai) పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
 

Also Read: Pushpa Movie Record Collections: బాక్సాఫీసు వద్ద దుమ్మురేపుతున్న పుష్ప సినిమా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News