Tamilnadu Elections 2021: టీటీవీ దినకరన్‌తో పొత్తు, మూడు స్థానాల్లో బరిలో దిగనున్న ఎంఐఎం పార్టీ

Tamilnadu Elections 2021: ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ తమిళనాడు ఎన్నికల్లో పోటీకు సిద్దమయ్యారు. టీటీవి దినకరన్ పార్టీతో పొత్తు కుదుర్చుకున్నారు. ఒవైసీ సారధ్యంలో ఎంఐఎం తమిళనాడులో మూడు స్థానాల్నించి పోటీ చేయనుంది.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 9, 2021, 05:10 PM IST
Tamilnadu Elections 2021: టీటీవీ దినకరన్‌తో పొత్తు, మూడు స్థానాల్లో బరిలో దిగనున్న ఎంఐఎం పార్టీ

Tamilnadu Elections 2021: ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ తమిళనాడు ఎన్నికల్లో పోటీకు సిద్దమయ్యారు. టీటీవి దినకరన్ పార్టీతో పొత్తు కుదుర్చుకున్నారు. ఒవైసీ సారధ్యంలో ఎంఐఎం తమిళనాడులో మూడు స్థానాల్నించి పోటీ చేయనుంది.

హైదరాబాద్‌కు చెందిన ఎంఐఎం పార్టీ(MIM Party) దేశంలోని వివిధ రాష్ట్రాలకు విస్తరించే యోచన చేస్తోంది. ఇప్పటికే మహారాష్ట్ర(Maharashtra), బీహార్(Bihar)లో గెలిచిన ఆ పార్టీ ఇప్పుడు తమిళనాడు ఎన్నికల్లో(Tamilnadu Elections) పోటీకు సిద్ధమైంది. దీనికోసం అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం పార్టీతో పొత్తు కుదుర్చుకుంది. ఏఎమ్ఎమ్‌కే ప్రధాన కార్యదర్శి టీటీవి దినకరన్ , ఒవైసీ ఈ మేరకు చర్చలు జరిపారు. ఒవైసీ నేతృత్వంలోని ఎంఐఎం పార్టీ కృష్ణగరి, శంకరాపురం, వానియంబాడి స్థానాల్నించి పోటీ చేస్తోంది. 

మరోవైపు కమల్ హాసన్(Kamal haasan) నేతృత్వంలోని మక్కల్ నీది కయ్యం, ఐజేకే, సమక పార్టీలు ఓ కూటమిగా ఏర్పడ్డాయి. ఆలందూరు స్థానం నుంచి కమల్ హాసన్ పోటీకు దిగుతున్నారు. అటు డీఎంకే , కాంగ్రెస్, ఇండియన్ ముస్లిం లీగ్, మనిదనేయ మక్కల్ కట్చి, సీపీఐ, ఎండీఎంకే, వీసీకేలు ఓ కూటమిగా పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ 25 స్థానాల్లో పోటీ చేస్తుండగా, డీఎంకే(DMK) 178 స్థానాల్లో బరిలో దిగుతోంది. కన్యాకుమారి లోక్‌సభ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తోంది. మొత్తం మీద తమిళనాట ఈసారి 3-4 కూటములు కలిసి ఎన్నికల బరిలో దిగనున్నాయి. 

Also read: Uttarakhand CM Trivendra Singh Rawat Resigns: ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ రాజీనామా, అసలేం జరిగింది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News