Mamata Banerjee Delhi Tour: మమతా బెనర్జీ ఢిల్లీ పర్యటన లక్ష్యం అదేనా

Mamata Banerjee Delhi Tour: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఢిల్లీ పర్యటన చేపట్టారు. ఢిల్లీ పర్యటనలో విపక్ష నేతల్ని కలవనుండటంతో పర్యటన కాస్తా ప్రాధాన్యత సంతరించుకుంది. విపక్షాల ఏకీకరణ ప్రధాన ఎజెండాగా భావిస్తున్నారు.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 26, 2021, 02:47 PM IST
Mamata Banerjee Delhi Tour: మమతా బెనర్జీ ఢిల్లీ పర్యటన లక్ష్యం అదేనా

Mamata Banerjee Delhi Tour: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఢిల్లీ పర్యటన చేపట్టారు. ఢిల్లీ పర్యటనలో విపక్ష నేతల్ని కలవనుండటంతో పర్యటన కాస్తా ప్రాధాన్యత సంతరించుకుంది. విపక్షాల ఏకీకరణ ప్రధాన ఎజెండాగా భావిస్తున్నారు.

2024 సార్వత్రిక ఎన్నికలకు అప్పుడే సన్నాహాలు ప్రారంభమయ్యాయని అన్పిస్తోంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee) ఢిల్లీ పర్యటన వెనుక కారణాల గురించి రాజకీయ వీధుల్లో చర్చ ప్రారంభమైంది. మమతా బెనర్జీతో పాటు టీఎంసీ ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ, ఎంఎస్ బెనర్జీలు ఉన్నారు. మమతా బెనర్జీ ఢిల్లీ పర్యటనలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, శరద్ పవార్‌తో పాటు విపక్షనేతలందర్నీ కలవనున్నారు. 2004 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా ప్రతిపక్షాల్ని ఏకం చేసేందుకే మమతా ఢిల్లీ పర్యటన(Mamata Banerjee Delhi Tour) చేపట్టినట్టు టీఎంసీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 28వ తేదీన ప్రతిపక్ష నేతలతో భేటీ కానున్నారు. అటు ప్రధాని నరేంద్రమోదీ(PM Narendra modi)ని సైతం మమతా బెనర్జీ కలవనున్నారు. 

ఇప్పటికే 7 సార్లు ఎంపీగా చేసిన మమతా బెనర్జీ బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు తీవ్రతరం చేశారు. కరోనా నియంత్రణలో కేంద్ర ప్రభుత్వ విఫలమైందని ఆరోపిస్తూ వస్తున్నారు. ప్రధాని అభ్యర్ధి వరుసలో మమతా బెనర్జీ ముందు వరుసలో ఉన్నారని..అందుకే ఢిల్లీ రాజకీయాలపై దృష్టి సారించారని టీఎంసీ (TMC)ఎంపీ ఒకరు వెల్లడించారు. దీదీ ఢిల్లీ పర్యటన ఇప్పుడు సర్వత్రా ఆసక్తి రేపుతోంది. 

Also read: Rockslide: హిమాచల్‌ప్రదేశ్‌లో కొండ చరియలు విరిగిపడి 9 మంది మృతి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News