India Corona update: మహారాష్ట్రలో భారీగా కరోనా కేసులు- కొత్తగా 198 మందికి ఒమిక్రాన్​!

India Corona update: దేశంలో కరోనా ఆందోళనలు మళ్లీ తీవ్రమవుతున్నాయి. మహారాష్ట్ర, పశ్చిమ్​ బెంగాల్​, కేరళ  సహా వివిధ రాష్ట్రాల్లో కొవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 30, 2021, 11:46 PM IST
  • దేశంలో మళ్లీ కరోనా కలవరం
  • భారీగా పెరుగుతున్న కేసులు
  • ఒమిక్రాన్​ కేసుల్లో భారీ వృద్ధి
India Corona update: మహారాష్ట్రలో భారీగా కరోనా కేసులు- కొత్తగా 198 మందికి ఒమిక్రాన్​!

India Corona update: దేశంలో కరోనా కేసులు మరోసారి భారీగా విజృంభిస్తున్నాయి. మరోవైపు కొవిడ్ ఒమిక్రాన్​ కేసులు సైతం ఆందోళనకరంగా (Omicron cases in India) పెరుగుతున్నాయి. తాజాగా పెరుగుతున్న కొవిడ్​ కేసులు.. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో థార్డ్ వేవ్ రావచ్చన్న (Corona Third wave) అంచనాలకు బలాన్ని చేకూరుస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

వివిధ రాష్ట్రాల్లో కరోనా, ఒమిక్రాన్​ వేరియంట్ కేసులు ఇలా..

మహారాష్ట్రలో నేడు ఒక్క రోజే అత్యధికంగా 5,368 కరోనా కేసులు (Corona cases in Maharashtra) నమోదయ్యాయి. 22 మంది కొవిడ్​ కారణంగా మృతి చెందారు. రాష్ట్రంలో ఇంకా 18,217 యాక్టివ్​ కేసులు ఉన్నాయి. ఒక్క ముంబయిలోనే 3,671 కేసులు (Corona cases in Mumbai) బయటపడటం గమనార్హం.

ఇక ఒక్క రోజులోనే మహారాష్ట్రలో 198 ఒమిక్రాన్​ కేసులు బయటపడ్డాయి. దీనితో మొత్తం ఒమిక్రాన్ కేసులు 450కి (Omicron cases in Maharashtra) చేరాయి.

పశ్చిమ్​ బెంగాల్లోనూ 2,128 కరోనా కేసులు (Corona cases in West Bengal) నమోదయయ్యాయి. 12 మంది కొవిడ్​కు బలయ్యారు.

కేరళలో కొత్తగా 2,423 కరోనా కేసులు (Corona cases in Kerala) బయటపడ్డాయి. ఒక్క రోజులో ఇక్కడ కొవిడ్ కారణంగా 15 మంది ప్రాణాలు కోల్పోయారు.

దేశ రాజధాని ఢిల్లీలో 1,313 తాజా కరోనా కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 3,081గా (Corona cases in Delhi) ఉంది. ఇక్కడ పాజిటివిటీ రేటు 1.73 శాతంగా ఉంది.

గుజరాత్​లో కొత్తగా 573 కరోనా కేసులు (Corona cases in Gujarat) నమోదయ్యాయి. మరో ఇద్దరు కొవిడ్​తో మృతి చెందారు. రాష్ట్రంలో ఒమిక్రాన్​ కేసుల సంఖ్య 97గా ఉంది.

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 280 మందికి కరోనా పాజిటివ్​గా (Corona cases in Telangana) తేలింది. ఒకరు కొవిడ్​కు బలయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3,563 యాక్టివ్​ కేసులు ఉన్నాయి. ఇక రాష్ట్రంలో మరో 5 ఒమిక్రాన్​ కేసులు బయటపడ్డాయి. దీనితో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 67కి (Omicron cases in Telangana) పెరిగింది.

Also read: Mumbai on High Alert: ముంబయికి ఉగ్రదాడి ముప్పు- అప్రమత్తమైన పోలీసులు!

Also read: తస్మాస్ జాగ్రత్త.. నాలుగు డోసులు తీసుకున్న మహిళకు పాజిటివ్‌! విమానం ఎక్కకుండా అడ్డుకున్న అధికారులు!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News