Madhya Pradesh Taj Mahal Replica: వివాహబంధం తర్వాత తమ భార్యలకు భర్తలు ఏదో ఒక సర్ ప్రైజ్ ఇస్తూ ఉంటారు. అలానే మధ్యప్రదేశ్ కు చెందిన ఆనంద్ ప్రకాష్ చౌక్సే అనే వ్యక్తి తన సతీమణి కోసం ఏకంగా తాజ్ మహల్ కట్టించి బహుమతిగా ఇచ్చాడు. అందులో నాలుగు పడక గదులతో పాటు వంట గది, లైబ్రరీ, ధ్యానం చేసేందుకు ప్రత్యేక గది నిర్మించారు. దీన్ని నిర్మించడానికి మూడేళ్ల సమయం పట్టింది. ఈ సందర్భంగా ఏఎన్ఐ వార్తాసంస్థతో ఆనంద్ ప్రకాష్ చౌక్సే మాట్లాడారు.
“ఈ నాలుగు పడక గదుల ఇల్లు.. నా ప్రేమ స్మారక చిహ్నాన్ని సూచిస్తుంది. ఇది నా భార్య కోసం. ఈ తాజ్ మహల్ మా పాఠశాల ఆవరణలో ఉన్నందున, పాఠశాల సమయంలో సందర్శకులను అనుమతిస్తారు. ఇది పర్యాటక కేంద్రంగా మారాలని నేను కోరుకుంటున్నాను" అని ఆనంద్ చౌక్సే తెలిపారు.
తాజ్ మహల్ లాంటి నిర్మించిన కన్సల్టెంట్ ఇంజనీర్ ప్రవీణ్ చౌక్సే మాట్లాడుతూ.. “దీన్ని పూర్తి చేయడానికి మాకు 2.5 సంవత్సరాలు పట్టింది. తాజ్ మహల్ లాంటి రూపు కోసం మేము ఆగ్రాను సందర్శించాము కొన్ని సాంకేతిక కొలతలు, ఫోటోగ్రాఫ్‌లతో దీన్ని రూపొందించాం. మేము ఇంటర్నెట్ నుంచి కొలతలతో పాటు ముఖ్యంగా 360-డిగ్రీ వీక్షణను కూడా పొందాము. వాటిని ఉపయోగించి కట్టడాన్ని పూర్తి చేశాం” అని అన్నారు.
Also Read: భారీ వర్షాలతో వరద ముంపులో తమిళనాడు దృశ్యాలు
Also Read: Rape in Madhya Pradesh: 62 ఏళ్ల వృద్దురాలిపై 75 ఏళ్ల వృద్దుడి అత్యాచారం...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook