Minor boy kills another Minor: మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్ జిల్లాలో దారుణం జరిగింది. తమ పంట చేనులో మొక్కను పీకేసినందుకు 12 ఏళ్ల బాలుడు ఏడేళ్ల బాలుడిని హత్య చేశాడు. విచక్షణారహితంగా దాడి చేయడంతో స్పృహ కోల్పోయిన బాలుడు.. ఆ తర్వాత కొద్దిసేపటికే ప్రాణాలు వదిలాడు. ఖాక్నర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని షేక్‌పూర్ గ్రామంలో ఈ నెల 26న ఈ ఘటన చోటు చేసుకుంది.
అప్పుడెప్పుడో వచ్చిన చిరంజీవి ఇంద్ర సినిమాలో 'మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా..' అనే డైలాగ్ ఉంటుంది. ఈ ఘటన గురించి వింటుంటే ఆ డైలాగ్ గుర్తురాక మానదు అని చెప్పడంలో సందేహం అక్కర్లేదేమో. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం... ఈ నెల 26న షేక్‌పూర్ గ్రామ పరిధిలోని ఓ పంట చేను వద్దకు అదే గ్రామానికి చెందిన ఏడేళ్ల బాలుడు వెళ్లాడు.
ఆ పంట చేనులో శనగ మొక్కలు ఉండటంతో.. అందులో ఒక మొక్కను పీకి శనగ గింజలు తినబోయాడు. ఆ సమయంలో చేనుకు కాపలాగా ఉన్న 12 ఏళ్ల బాలుడు అతన్ని గమనించాడు. వెంటనే అతని వద్దకు పరిగెత్తుకెళ్లి విచక్షణారహితంగా కొట్టాడు. దీంతో ఆ ఏడేళ్ల బాలుడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. అతను ఎంతసేపటికీ లేవకపోవడంతో దాడి చేసిన బాలుడు భయపడిపోయాడు. అతన్ని స్పృహలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించినప్పటికీ లాభం లేకపోయింది.
అపస్మారక స్థితిలోకి వెళ్లిన బాలుడిని అక్కడే వదిలేసి అతను ఇంటికి వెళ్లిపోయాడు. ఆ మరుసటి రోజు చేను వద్దకు వచ్చేసరికి.. కిందపడిపోయిన బాలుడు ఇంకా అక్కడే ఉన్నాడు. దీంతో భయపడిపోయిన అతను.. ఇంటికి వెళ్లి విషయం కుటుంబ సభ్యులకు చెప్పాడు. కుటుంబ సభ్యులు చేను వద్దకు పరిగెత్తుకొచ్చి అపస్మారక స్థితిలో ఉన్న బాలుడిని పరిశీలించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా.. సంఘటనా స్థలానికి చేరుకుని బాధిత బాలుడిని పరిశీలించారు. అప్పటికే అతను చనిపోయినట్లు (Murder Incident) నిర్ధారించారు. పోస్టుమార్టమ్ రిపోర్టులో బాలుడి గొంతు నులిమి చంపేసినట్లుగా వెల్లడైంది. దీంతో దాడికి పాల్పడిన బాలుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Budget 2022: ఈసారి ఇన్‌కమ్ ట్యాక్స్ స్లాబ్స్, 80సీ 80సీసీడీ మినహాయింపుల్లో మార్పు ఉంటుందా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook