గోవుల రక్షణ కోసం తాను ఏకంగా ఓ ప్రత్యేక మంత్రిత్వ శాఖనే ఏర్పాటు చేయాలని అనుకున్నానని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ ప్రకటించారు. ప్రస్తుతం సేవలు అందిస్తున్న కౌ ప్రొటెక్షన్ బోర్డ్(గో రక్షణ మండలి)నే ఓ ప్రత్యేక మంత్రిత్వ శాఖగా మార్చాలని తాను భావించినట్టు శివరాజ్ సింగ్ చౌహన్ వెల్లడించారు. ఆదివారం ఖజురహోలో ఏర్పాటు చేసిన ఓ పబ్లిక్ మీటింగ్‌లో మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్‌లో త్వరలోనే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ గత కొంత కాలంగా మధ్యప్రదేశ్ రాష్ట్ర నలుమూలలా మెరుపు యాత్రలు చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ఆదివారం ఆయన వెయ్యేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఖజురహోలో పర్యటించారు.