సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ ఘటన చోటు చేసుకుంది. ప్రయాణికులకు మత్తు మందుతో కూడిన కూల్ డ్రింక్ ఇచ్చి దోపిడీకి పాల్పడ్డారు. వారు ఆపస్మారక స్థితిలోకి వెళ్లగానే విలువైన వస్తువులు, నగదు, సెల్‌ఫోన్‌లు ఎత్తుకు పోయారు. బెంగళూరు నుంచి బయలుదేరిన సంపత్‌క్రాంతి ఎక్స్‌ప్రెస్ జనరల్ బోగీలో ఈ ఘటన చోటు చేసుకుంది
గంటల తరబడి మత్తులో ఉన్న వారి పరిస్థితి గమనించిన తోటి ప్రయాణికులు రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోని దిగిన పోలీసులు ..బాధితులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్సనందిచడంతో వారు తేరకున్నారు.
బాధితులు తేరుకున్న తర్వాత అసలు విషయం బయటికి వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తులు కూల్ డ్రింక్ లో మత్తు మందు ఇచ్చి వీరి నుంచి ఆరు ఫోన్‌లు, ఒక బంగారు ఉంగరం, రూ.10 వేల నగదు, పర్సు, ఇతర వస్తువులు ఎత్తుకు వెళ్లినట్లు ప్రాథమికంగా నిర్థారించారు.
రైల్వే పోలీసుల సమాచారం ప్రకారం బాధితులు కర్ణాటక రాష్ట్రం శ్రావణబెలగొళకు చెందిన చెందిన నితిన్‌జైన్ , బెంగళూరుకు చెందిన రాహుల్ , బీహార్‌కు చెందిన ప్రేమ్‌శంకర్ , ఉత్తరప్రదేశ్‌కు చెందిన టింక్ , సూర్యకాంత్, అబ్బాస్‌ఖాన్ గా గుర్తించారు
రైళ్లలో ప్రయాణించే సమమంలో ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. పరిచయం లేని వారు ఎవరైన ఏదైన తినుబండారాలు కానీ.. కూలిడ్రింగ్ తరహా శీతల పానియాలు కానీ..ఇలా ఏం ఇచ్చినా తీసుకోవద్దని హెచ్చరిస్తునన్నారు. ఎవరైన అనుమానాస్పదరీతిలో వ్యహరిస్తే తమకు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరుతున్నారు