Lok Sabha Elections Results 2024: గత రెండు లోక్ సభ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అన్నట్టుగా సాగింది. కానీ 18వ లోక్ సభకు జరిగిన ఎన్నికల్లో ఎన్టీయే కూటమికి విపక్ష ఇండియా కూటమి గట్టి పోటీ ఇచ్చింది. ఈ ఎన్నికల్లో బీజేపీకి కంచు కోట అయినట్టు వంటి ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, మహారాష్ట్రలో కోలుకోలేని దెబ్బ తగిలింది. అయితే ఈ ఎన్నికల్లో కొంత మంది ఎంపీలు 11 లక్షల మెజారిటీతో సాధిస్తే.. మరికొందరు కేవలం 48 ఓట్లతో గెలుపొందిన వాళ్లున్నారు. ఈ ఎన్నికల్లో మహారాష్ట్రలోని ముంబై నార్త్ వెస్ట్ స్థానం నుంచి ఏక్ నాథ్ షిండే శివసేన తరుపున రవీంద్ర దత్తారామ్ తన సమీప ప్రత్యర్ధి శివసేన ఉద్ధవ్ థాక్రే కు చెంిన అన్మోల్ కీర్తికర్ పై ఈ విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో 4,52,644 ఓట్లు దత్తారామ్ వస్తే.. ప్రత్యర్ధి అన్మోల్ కు 4,52,596 ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ నోటా 15,161 ఓట్లు పడటం విశేషం.
కేరళలోని అత్తింగళ్ స్థానంలో కాంగ్రెస్ క్యాండిడేట్ అదూర్ ప్రకాష్ పై తన అపోజిట్ క్యాండిడేట్ పై 684 ఓట్ల మెజారిటితో నెగ్గారు. ఇక్కడ అదూర్ ప్రకాష్ కు 3,28,051 ఓట్లు వస్తే.. సీపీఎంకు 3,27,367 ఓట్లు పోలయ్యాయి. నోటాకు 9791 ఓట్లు పోలయ్యాయి.
ఒడిశాలోని జయపురంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్ధఇ రబీంద్ర నారాయణ్ బెహరాకు 5,34, 239 ఓట్లు పోలయ్యాయి. మరోవైపు ఆయన ప్రత్యర్ధి బీజేడీ క్యాండిడేట్ శర్మిష్ఠా సేథి 5,32,652 ఓట్లతో జయ కేతనం ఎగరేసారు. అక్కడ 1587 ఓట్లతో బీజేపీ క్యాండిడేట్ కు విజయం వరించింది. ఈ స్థానంలో నోటాకు 6,788 ఓట్లు పోలయ్యాయి.
రాజస్థాన్ రాష్ట్రంలోని కాంగ్రెస్ క్యాండిడేట్ అనిల్ చోప్రాకు 6,16,262 ఓట్లు వచ్చాయి. మరోవైపు బీజేపీ అభ్యర్ధి రాజేంద్ర సింగ్ కు 6,17,877 ఓట్లు పోలయ్యాయి. ఈ స్థానంలో కూడా మెజార్టీ కంటే నోటాకే 7519 ఓట్లు పోలు కావడం ఆశ్యర్యకరమైన విషయం.
ఛత్తీస్ గఢ్ లో కాంకేర్ స్థానంలో భారతీయ జనతా పార్టీ భోజ్ రాజ్ నాగ్ 5,97,624 ఓట్లు పడ్డాయి. మరోవైపు కాంగ్రెస్ క్యాండిడేట్ బీరేశ్ ఠాకూర్ కు 5,95, 740 ఓట్లు వచ్చాయి. మొత్తంగా 1884 ఓట్ల మెజారిటీతో జయ కేతనం ఎగరేసారు. ఈ స్థానంలో నోటాకు ఏకంగా 18,669 ఓట్లు పడటం విశేషం.
Read more:Snakes repellent plants: ఈ చెట్లంటే పాములకు ఎంతో భయం.. ఆ ఇళ్లవైపు కన్నేత్తి కూడా చూడవంట..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter