Presidential Election Result-LIVE Updates: కాసేపట్లో రాష్ట్రపతి ఎన్నికల తుది ఫలితాలు..సంబరాల్లో బీజేపీ నేతలు..!

15వ భారత రాష్ట్రపతి ఎవరన్న దానిపై కాసేపట్లో క్లారిటీ రానుంది. ఫైనల్ ఫలితాలను అధికారులు ప్రకటించనున్నారు.

Written by - Alla Swamy | Last Updated : Jul 21, 2022, 07:22 PM IST
  • భారత రాష్ట్రపతి ఎన్నికల కౌంటింగ్
  • ద్రౌపది ముర్ము వర్సెస్ యశ్వంత్ సిన్హా
  • ఈనెల 25న నూతన రాష్ట్రపతి ప్రమాణస్వీకారం
Presidential Election Result-LIVE Updates: కాసేపట్లో రాష్ట్రపతి ఎన్నికల తుది ఫలితాలు..సంబరాల్లో బీజేపీ నేతలు..!
Live Blog

Presidential Election Result 2022-LIVE*: భారత రాష్ట్రపతి ఎన్నికల ఫలితాలను అధికారికంగా కాసేపట్లో ప్రకటించనున్నారు. ఇప్పటికే ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము ఆధిక్యంలో ఉన్నారు. ఆమె గెలుపు లాంఛనంగా కనిపిస్తోంది. రాష్ట్రాల్లో యశ్వంత్ సిన్హా కాస్త పోటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాసేపట్లో 15వ రాష్ట్రపతి ఎవరన్న దానిపై క్లారిటీ రానుంది. ఈనెల 25న నూతన రాష్ట్రపతి ప్రమాణస్వీకారం చేయనున్నారు.

21 July, 2022

  • 19:20 PM

    Droupadi Murmu Wins Presidential Election Race: రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డిఏ అభ్యర్థిగా బరిలో నిలిచిన ద్రౌపది ముర్ము విజయానికి అతి సమీపంలో ఉన్నారు. కౌంటింగ్ ముగింపునకు రావడం, విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా కంటే ద్రౌపది ముర్ము అందనంత ముందంజలో ఉండటంతో ఇప్పటికే దేశవ్యాప్తంగా బీజేపి పార్టీ ఆఫీసుల ఎదుట గెలుపు సంబరాలు మొదలయ్యాయి.

  • 17:36 PM

    పార్లమెంట్ హాల్‌లో భారత రాష్ట్రపతి ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఇప్పటివరకు రెండు రౌండ్ల పూర్తి అయ్యాయి. ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు 809 ఓట్లు రాగా..విపక్షాల అభ్యర్థికి 329 ఓట్లు వచ్చాయి. ఇప్పటివరకు 10 రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ పూర్తి అయ్యింది.

     

  • 17:23 PM

    దేశవ్యాప్తంగా బీజేపీ సంబరాలు

  • 17:11 PM

    భారత రాష్ట్రపతి ఎన్నికల ఫలితాలను అధికారికంగా కాసేపట్లో ప్రకటించనున్నారు. ఇప్పటికే ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము ఆధిక్యంలో ఉన్నారు. ఆమె గెలుపు లాంఛనంగా కనిపిస్తోంది. రాష్ట్రాల్లో యశ్వంత్ సిన్హా కాస్త పోటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాసేపట్లో 15వ రాష్ట్రపతి ఎవరన్న దానిపై క్లారిటీ రానుంది.

  • 16:47 PM

    రాష్ట్రపతి ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము హవా కొనసాగుతోంది. తొలి రౌండ్‌లో సంపూర్ణ మెజార్టీ సాధించారు. దీంతో బీజేపీ నేతల సంబరాలు అంబరాన్ని అంటాయి. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆధ్వర్యంలో సంబరాలు జరిగాయి. 

     

  • 16:03 PM

     రాష్ట్రపతి ఎన్నికల కౌంటింగ్ లో ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము సంపూర్ణ ఆధిక్యం  సాధిస్తున్నారు.

     

  • 15:58 PM

    పార్లమెంట్ హాల్‌లో రాష్ట్రపతి ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము సంపూర్ణ ఆధిక్యంలో ఉన్నారు. తొలి రౌండ్‌లో భారీ మెజార్టీ సాధించారు. 

  • 14:53 PM

    రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము దూసుకెళ్తున్నారు. తన ప్రత్యర్థి యశ్వంత్ సిన్హాపై ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ద్రౌపది ముర్ముకు 540 ఓట్లు రాగా..యశ్వంత్ సిన్హాకు 208 ఓట్లు వచ్చాయి. 15 ఓట్లు చెల్లని ఓట్లుగా గుర్తించారు. ఎంపీల ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యింది. ఇక రాష్ట్రాల వారిగా లెక్కింపు చేపట్టనున్నారు.

     

  • 14:08 PM

    పార్లమెంట్ హాల్‌లో రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు సాగుతోంది. మరోవైపు దేశవ్యాప్తంగా బీజేపీ సంబరాలు మొదలైయ్యాయి. ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము ఎన్నిక లాంఛనమని బీజేపీ నేతలు అంటున్నారు. ఒడిశాలో సంప్రదాయ పద్దతిలో బీజేపీ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.

     

  • 12:53 PM

    ఢిల్లీలోని పార్లమెంట్‌ భవనంలో భారత రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. సాయంత్రం 4 గంటలకు తుది ఫలితం రానుంది. 

  • 12:01 PM

    రాష్ట్రపతి ఎన్నికకు రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోదీ ప్రధాన రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల కౌంటింగ్‌లో ఎంపీలు, ఎమ్మెల్యేల బ్యాలెట్ పేపర్లను వేరు చేసి లెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఎంపీల ఓట్ల లెక్కింపు జరుగుతోంది. అన్ని రాష్ట్రాల ఓట్ల లెక్కింపు పూర్తైన తర్వాత తుది ఫలితాలను వెల్లడిస్తారు. ఈ ఎన్నికలో ఒక్కో ఎంపీ ఓటు విలువ 700గా నిర్ణయించారు. ఎమ్మెల్యే ఓటు విలువ ఆయా రాష్ట్రాన్ని బట్టి ఉండనుంది. 

  • 11:53 AM

    పార్లమెంట్‌లో భారత రాష్ట్రపతి ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. 

     

Trending News