Independence Day 2024 Live Updates: ‘వికసిత్ భారత్’థీమ్‌తో దేశవ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అంబరాన్ని అంటాయి. 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని ఎర్రకోట నుంచి జాతీయ జెండాను ఎగురవేశారు. వరుసగా 11వ సారి ఆయన ప్రధానిగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఇప్పటివరకు అత్యధికంగా 17 సార్లు జాతీయ జెండాను ఎగురవేసిన ప్రధానిగా జవహర్లాల్ నెహ్రూ మొదటిస్థానంలో ఉన్నారు. ఆ తరువాత ఇందిరాగాంధీ 16 సార్లు ఎగురవేసి మూడోస్థానంలో ఉన్నారు. ఇప్పుడు మోదీ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను అధికమించి మూడోస్థానంలోకి వచ్చారు. ఈ ఏడాది వేడుకలను భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. దాదాపు 6 వేల మంది అతిథులను ఆహ్వానించారు. అనంతరం జాతినుద్దేశించి మాట్లాడిన ప్రధాని మోదీ.. దేశ ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు.
Independence Day 2024 Celebrations: అంబరాన్ని అంటిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. ఎర్రకోటపై మువ్వన్నెల జెండా రెపరెపలు..