Infants deaths in Rajastan : 104 మంది శిశువుల మృతి.. ప్రియాంక గాంధీ, సీఎం గెహ్లాట్‌పై మాయావతి మండిపాటు

రాజస్థాన్‌ కోటా జిల్లాలోని జేకే లోన్‌ ప్రభుత్వాసుపత్రిలో కేవలం నెల రోజుల వ్యవధిలో 104 మంది శిశువులు మృతి చెందారు. ఈ ఘటనపై బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి తీవ్ర స్థాయిలో స్పందించారు. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీపై, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్‌లపై మండిపడ్డారు.

Last Updated : Jan 3, 2020, 01:53 PM IST
Infants deaths in Rajastan : 104 మంది శిశువుల మృతి.. ప్రియాంక గాంధీ, సీఎం గెహ్లాట్‌పై మాయావతి మండిపాటు

కోటా: రాజస్థాన్‌ కోటా జిల్లాలోని జేకే లోన్‌ ప్రభుత్వాసుపత్రిలో కేవలం నెల రోజుల వ్యవధిలో 104 మంది శిశువులు మృతి చెందారు. ఈ ఘటనపై బహుజన్ సమాజ్ పార్టీ (BSP ) అధినేత్రి మాయావతి తీవ్ర స్థాయిలో స్పందించారు. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీపై, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్‌లపై మండిపడ్డారు. శిశువులు చనిపోతుంటే నిర్లక్ష్యం వహించారని ట్విట్టర్ వేదికగా విమర్శించారు. నేటికీ పరిస్థితి అదుపులోకి రాలేదని ఆందోళన వ్యక్తం చేశారు.

‘రాజస్థాన్ కోటాలోని ఓ ఆస్పత్రిలో వందకు పైగా శిశువులు మృతిచెందడం బాధాకరం. సీఎం అశోక్ గెహ్లాట్ శిశువులు ఘటనపై నిర్లక్ష్యం వహించారు. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ మహిళ అయినప్పటికీ ఇలాంటి ఘటనపై నోరు విప్పకపోవడంపై దారుణం. యూపీలో బాధిత నిరసనకారులను పరామర్శించే కంటే కోటాలో చనిపోయిన చిన్నారుల కుటుంబాలను ప్రియాంక పరామర్శించడం సరైన నిర్ణయం. అయితే రాజకీయంగా లబ్ధి పొందడానికే ప్రియాంక గాంధీ యూపీ సమస్యలపై స్పందిస్తున్నారని’ మాయావతి వరుస ట్వీట్లలో విమర్శించారు.

Read also : 100కు చేరిన శిశు మరణాలు.. ఆ ఆస్పత్రిలో అసలేం జరుగుతోంది ?

కాంగ్రెస్ పార్టీపై మండిపడిన బీఎస్పీ అధినేత్రి మాయావతి

రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ శిశు మరణాల ఘటనపై సోషల్ మీడియాలో స్పందించారు. శిశు మరణాలు ఇప్పటికే తగ్గుముఖం పట్టాయని, ఈ విషయంపై రాజకీయాలు చేయడం తగదని పేర్కొన్నారు. తల్లీబిడ్డల ఆరోగ్యమే తమకు ముఖ్యమని స్పష్టం చేశారు. చిన్నారులకు ఐసీయూను 2003లో కాంగ్రెస్ హయాంలోనే ప్రారంభించామని, అదే విధంగా కోటాలోనూ 2011లో ఈ సేవలు విస్తరించామని మరో ట్వీట్లో గెహ్లాట్ తెలిపారు.

కాగా, కోటాలోని జేకే లోన్ ఆస్పత్రికి శుక్రవారం ఆరోగ్య నిపుణులతో కూడిన బృందం వెళ్లనుంది. ఆస్పత్రిలో మౌళిక సదుపాయాలు, ప్రస్తుత పరిస్థితిని పర్యవేక్షించడానికి కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఈ ఏడాది తొలి రెండు రోజుల్లో మరో ముగ్గురు చిన్నారులు మృతిచెందడంతో మరణాల సంఖ్య 104కు చేరిన విషయం తెలిసిందే.

Trending News