Kolkata Women : కడుపు నొప్పితో ఆసుపత్రికి వెళ్తే.. మహిళ కాదు పురుషుడు అని తెలిసింది

కడుపు నొప్పి ( Abdominal Pain ) తో కోల్‌కతాకు చెందిన ఒక మహిళ ఆసుపత్రి వెళ్లింది. కొన్ని పరీక్షలు చేసిన తరువాత ‘ టెస్టిక్యూలర్ కేన్సర్ ‘  ( Testicular Cancer ) అని తెలుసుకుని షాక్ అయింది.

Last Updated : Jun 29, 2020, 07:22 PM IST
Kolkata Women :  కడుపు నొప్పితో ఆసుపత్రికి వెళ్తే.. మహిళ కాదు పురుషుడు అని తెలిసింది

కడుపు నొప్పి ( Abdominal Pain )  తో కోల్‌కతాకు చెందిన ఒక మహిళ ఆసుపత్రి వెళ్లింది.  కొన్ని పరీక్షలు చేసిన తరువాత ‘ టెస్టిక్యూలర్ కేన్సర్ ‘  ( Testicular Cancer ) అని తెలుసుకుని షాక్ అయింది.

పశ్చిమ బెంగాల్ ( West Bengal ) కు చెందిన 30 మహిళ జీవితం అప్పటి నుంచి పూర్తిగా మారిపోయింది. పరీక్షకు ముందు తాను మహిళ అనుకున్న ఆమె.. పరిక్షలు జరిగిన తరువాత వైద్యులు చెప్పింది విని షాక్ అయింది.  ఎందుకంటే ఆమె జెనెటికల్ ( Genetical )  గా పురుషుడిగా జన్మించింది. అయితే శారీరకంగా ఒక మహిళకు ఉండాల్సిన అన్నిలక్షణాలు ఆమెలో ఉన్నాయి.  ఆసుపత్రికి వచ్చినప్పుడు వైద్యులు ముందు కరియోటైపింగ్ ( Karyotyping)  అనే టెస్ట్ ను నిర్వహించారు.  ఇందులో ఆమె శరీరంలో ఉన్న క్రోమోజోన్ ( Chromozones ) లో  XX అనే కాంప్లిమెంట్ కు బదులుగా  XY అని తేలింది.  Also Read : విషాదం: పెళ్లి తంతు ముగిసేలోపే వధువు మృతి

22 వేల మందిలో ఒకరికి మాత్రమే ఈ డిజార్డర్ ఉంటుంది. అయితే ఆ వ్యక్తి చూడ్డానికి, నడక, హావభావాలు  ఇలా అన్ని లక్షణాలు పూర్తిగా మహిళను పోలి ఉన్నాయి.  కానీ ఆ వ్యక్తిలో అండాశయం ( Ovaries ) , గర్భాశయం ( Uterus ) రెండూ లేవు. దాంతో  ఆమెకు  సంతానోత్పత్తి  ( Reproduction ) సమస్యలు కూడా వస్తాయని వైద్యులు తెలిపారు. 

అయితే ఆమెలో వ్రషణాలు ( Testicles ) ఉన్న విషయం  కూడా టెస్ట్ చేసేంతవరకు  తెలియలేదు.  ఆ వ్యక్తి సోదరికి కూడా పరీక్షలు నిర్వహించగా ఆమెకు పరిస్థితి కూడా అదే విధంగా ఉన్నట్టు తెలిసింది.  ప్రస్తుతం వైద్యులు వారికి చికిత్స చేస్తున్నారు.

Trending News