Kolkata Metro Rail: దేశంలోనే తొలిసారిగా నది కింద నుంచి మెట్రో రేక్ రన్.. చరిత్ర సృష్టించిన కోల్‌కతా మెట్రో రైలు

Kolkata Metro Rail Track Under Hooghly River: కోల్‌కతా మెట్రో రైల్వే జనరల్ మేనేజర్ పి ఉదయ్ కుమార్ రెడ్డి సైతం మెట్రో రేక్ రన్‌లో భాగంగా కోల్‌కతాలోని మహాకరన్ మెట్రో స్టేషన్ నుంచి హౌరా మైదాన్ వరకు ప్రయాణించారు. ఆ తరువాత ఇదే ఈస్ట్ - వెస్ట్ మెట్రో కారిడార్ మార్గంలో కోల్‌కతా నుంచి హౌరా వరకు మరో రేక్ రన్ నిర్వహించారు.

Written by - Pavan | Last Updated : Apr 12, 2023, 11:45 PM IST
Kolkata Metro Rail: దేశంలోనే తొలిసారిగా నది కింద నుంచి మెట్రో రేక్ రన్.. చరిత్ర సృష్టించిన కోల్‌కతా మెట్రో రైలు

Kolkata Metro Rail Track Under Hooghly River: కోల్‌కతా మెట్రో రైలు చరిత్ర సృష్టించింది. కోల్‌కతా నుంచి హౌరాకు వెళ్లే మార్గంలో ఉన్న హుగ్లీ నది కింద నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సొరంగ మార్గం ద్వారా కోల్‌కతా మెట్రో రైలు రేక్ రన్ నిర్వహించింది. ఇలా నది కింద ఏర్పాటు చేసిన మార్గంలోంచి మెట్రో రైలు ప్రయాణించడం భారత్‌లో ఇదే తొలిసారి కావడంతో కోల్‌కతా మెట్రో రైలు దేశంలోనే చరిత్ర సృష్టించినట్టయింది. కోల్‌కతా నుంచి హౌరా వరకు ప్రయాణించిన ఈ మెట్రో రేక్‌లో మెట్రో రైలు అధికారులు, ఇంజనీర్స్, ఇతర సిబ్బంది మాత్రమే ప్రయాణించారు. కోల్‌కతా నుంచి హౌరా మార్గంలో రాకపోకలు సాగించే ప్రయాణికులకు ఈ అధునాతన సౌకర్యం ఎంతో మేలు చేయనుంది అని కోల్‌కతా మెట్రో రైలు అధికారులు తెలిపారు. ఈస్ట్ - వెస్ట్ మెట్రో కారిడార్ అభివృద్ధి పనుల్లో భాగంగా ఈ ప్రాజెక్టును నిర్మించారు.

కోల్‌కతా మెట్రో రైల్వే జనరల్ మేనేజర్ పి ఉదయ్ కుమార్ రెడ్డి సైతం మెట్రో రేక్ రన్‌లో భాగంగా కోల్‌కతాలోని మహాకరన్ మెట్రో స్టేషన్ నుంచి హౌరా మైదాన్ వరకు ప్రయాణించారు. ఆ తరువాత ఇదే ఈస్ట్ - వెస్ట్ మెట్రో కారిడార్ మార్గంలో కోల్‌కతా నుంచి హౌరా వరకు మరో రేక్ రన్ నిర్వహించారు. 

కోల్‌కతా మెట్రో రైలు రేక్ రన్‌పై మెట్రో రైల్వే జనరల్ మేనేజర్ పి ఉదయ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. " రాబోయే రోజుల్లో ఐదు నెలల నుంచి ఏడు నెలల వరకు హౌరా మైదాన్ నుంచి ఎస్ప్లనేడ్ స్టేషన్ వరకు ట్రయల్ రన్ నిర్వహించి ఆ తరువాత ప్రయాణికుల కోసం రెగ్యులర్ సర్వీసెస్ ప్రారంభిస్తాం " అని స్పష్టంచేశారు. ఈ మేరకు ఉదయ్ కుమార్ రెడ్డి ఒక ట్వీట్ కూడా చేశారు. నది కింద నుంచి భూగర్భంలో 4.8 కి.మీ మేర ఉన్న సొరంగ మార్గంలో త్వరలోనే ట్రయల్ రన్ ప్రారంభం అవుతుందని తెలిపారు. 

 

ఇది కూడా చదవండి : Old Pension Scheme: ఓపీఎస్‌పై లేటెస్ట్ అప్‌డేట్.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యగమనిక

దేశంలోనే ఇది అత్యంత లోతైన రైలు మార్గమని.. ఇలాంటి మెట్రో రైలు మార్గం నిర్మాణం కోసం ఎంతో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి శ్రమించాల్సి ఉంటుందని ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. తొలిసారిగా ఈ తరహా మార్గం నిర్మించినందున తొందరపడకుండా అన్నివిధాల ప్రయాణం సురక్షితం అని అన్ని విధాల నిర్థారించుకున్న తరువాతే ప్రయాణికుల కోసం ఈ మార్గాన్ని అందుబాటులోకి తీసుకొస్తాం అని అన్నారు. అంతేకాకుండా కోల్‌కతా - హౌరా భూగర్బ మార్గం అందుబాటులోకి వస్తే.. దేశంలోనే భూఉపరితలానికి 33 మీటర్ల లోతులో నిర్మించిన మెట్రో రైలు స్టేషన్‌గా హౌరా మైదాన్ మెట్రో రైలు స్టేషన్ నిలుస్తుంది అని ఉదయ్ కుమార్ పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి : COVID-19 Latest Updates: భారీగా కరోనా కేసులు.. 7 నెలల తరువాత రికార్డుస్థాయిలో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK

Trending News