Kolkata doctor rape and murder case latest updates : కోల్ కతా ట్రైనీ డాక్టర్ ఘటనలో సుప్రీంకోర్టు లో ఈరోజు వాడివేడిగా వదనలు జరిగాయి. ఈక్రమంలో డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని.. జస్టిస్ పార్థీవాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన అత్యున్నత ధర్మాసనం ఈ కేసును ఆగస్టు 20 న సుమోటోగా తీసుకుని విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. అంతేకాకుండా..దీనిపై కోల్ కతా ప్రభుత్వం, పోలీసులు, ఆర్జీకర్ సిబ్బందిపై కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదిలా ఉండగా.. ఘటన తర్వాత కోల్ కతా లో పరిస్థితులు పూర్తిగా అదుపుతప్పడంతో.. ఈ ఘటనలో సీబీఐ రంగంలోకి దిగింది. మరోవైపు ఈ ఘటనలో సీబీఐ ఈరోజు కోర్టులో షీల్డ్ కవర్ లో ఘటనపై చేపట్టి దర్యాప్తు వివరాలను ధర్మాసనం ముందు ఉంచింది.
ఆగస్టు 9 న హత్యచార ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత,జూనియర్ డాక్టర్ మృతదేహం దహనం చేసిన తర్వాతే.. ఎఫ్ఐఆర్ నమోదు చేశారన్నారు. అంతేకాకుండా..దాదాపు 18 గంటల తర్వాత క్రైమ్ సీన్ ను సీల్ చేశారని, దీని వల్ల క్రైమ్ సీన్ పూర్తిగా తారుమారయ్యిందని కూడా సీబీఐ తరపు లాయర్ లు ధర్మాసనం ఎదుట తమ వాదనలు విన్పించారు.
ఈ ఘటనలో.. వాస్తవాలను కప్పిపుచ్చేందుకు ఏదో జరుగుతుందని అనుమానంతో.. కొంత మంది డాక్టర్లు ఆందోళన చేస్తుండగా.. అప్పుడు మాత్రం వీడియో గ్రఫి చేశారన్నారు. ఈ నేపథ్యంలో సీబీఐ నివేదికపై డి.వై చంద్రచూడ్ మండిపడ్డారు. కేసునమోదు విషయంలో జరిగిన అలసత్వంపై ప్రశ్నల వర్షంకురిపించింది.
బాధితురాలు.. నగ్నంగా.. గాయాలతో కన్పిస్తున్న నేపథ్యంలో.. తొలుత ఆత్మహత్య అని , ఆ తర్వాత హత్యగా ఎలా చూపిస్తారని కూడా ఆగ్రహాం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అదే విధంగా ఈకేసు విచారణలో.. అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు తీరు పూర్తిగా అనుమానస్పదంగా ఉందని, తదుపరి విచారణకు ఆయన కోర్టు ఎదుట హజరు కావాలని కోర్టు సూచించింది. గత 30 ఏళ్లలో ఇలాంటి దారుణం తాము ఎప్పుడు చూడలేదంటూ కూడా ధర్మాసనం వ్యాఖ్యలు చేసింది.
కోల్ కతా ట్రైనీ డాక్టర్ ఘటన దేశంలో పెనుదుమారంగా మారింది. ఈ ఘటనపై ప్రస్తుతం పలు చోట్ల ఇప్పటికి కూడా నిరసనలు మిన్నంటాయి. అదే విధంగా వైద్యుల సదుపాయా విషయంలో ప్రత్యేకంగా చర్యలు తీసుకొవాలంటూ కూడా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇప్పటికే కేంద్రాన్ని కోరింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter