Kolkata Murder Case: ఆ విషయం బయట పెట్టాలి అనుకున్నందుకే.. చంపేశారా? ఫ్రెండ్స్ చెప్పిన షాకింగ్ నిజాలు..

RG Kar Medical College Murder case: కోల్‌కతా డాక్టర్ హత్య కేసు విషయంలో..  హత్యనకు గురైన యువతి తండ్రి తన కూతురు చావు మీద అనుమానం వ్యక్తం చేశారు. ఆమెను సెమినార్ హాలులోనే చంపారన్నది నిజం కాదేమో అని ఆయన అంటున్నారు. మరోవైపు హత్య కేసులో ఆమె స్నేహితులు కూడా కొన్ని కీలకమైన విషయాలు బయట పెట్టారు. అవి కేసుని కీలక మలుపు తిప్పబోతున్నాయి.   

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Aug 18, 2024, 04:03 PM IST
Kolkata Murder Case: ఆ విషయం బయట పెట్టాలి అనుకున్నందుకే.. చంపేశారా? ఫ్రెండ్స్ చెప్పిన షాకింగ్ నిజాలు..

Kolkata Doctor Rape and Murder case: కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్‌లో జరిగిన హత్య గురించి తెలియని వారు ఉండరు. ఈ కేసులో రేప్ కి గురయ్యి మరణించిన పీజీ ట్రెయినీ డాక్టర్ తో పని చేసిన కొందరు స్నేహితులు ఇప్పుడు కేస్ కి సంబంధించి కొన్ని కీలక వివరాలను బయటపెట్టారు. ఈ కేసు మామూలు రేప్, హత్య కేసు కాదు అని.. కేవలం బాధితురాలిని మాత్రమే లక్ష్యంగా పెట్టి హత్య జరిపారేమో అనే కొత్త కోణాన్ని కూడా వాళ్ళు వెలుగులోకి తెచ్చారు. 

బాధితురాలికి పని ఒత్తిడి చాలా ఉండేదని, రోజుకు 36 గంటలపాటు పనిచేయాల్సి వచ్చేది అని ఆమె డైరీలో ఉంది. ఇదిలా ఉంటే.. అసలు కేస్ లో మొదటి అనుమానితుడు సంజయ్ రాయ్ కి బాధితురాలు ఒంటరిగా సెమినార్ హాల్‌లో ఉన్న విషయం ఎలా తెలిసింది? అని వాళ్ళు ప్రశ్నించారు. దీని వెనుక పెద్ద కుట్రలో ఉండి ఉండవచ్చు అని.. అందుకే ఆమెను ప్రత్యేకంగా లక్ష్యంగా పెట్టారు అని కొందరి అనుమానం. 

అసలు అంత రాత్రి సమయంలో ఆమె సెమినార్ హాల్‌లో ఒంటరిగా ఉంది అనే విషయం ఒక సివిక్ వాలంటీర్ కి ఎలా తెలిసింది?" అని ఒక సహచరుడు ప్రశ్నించారు. మరొకరి బాధితురాలు తమ కాలేజ్ లో జరుగుతున్న అక్రమ పనుల గురించి ఏమైనా తెలుసుకునివుంటుంది అని.. అందుకే ఆ విషయాలు ఏమీ బయటకు రాకుండా ఆమెను రేప్ చేసి చంపేశారా అని ఆయన అన్నారు.

బాధితురాలి తల్లి కూడా దాడి జరగడానికి కొద్దిరోజుల ముందు ఆసుపత్రికి వెళ్లడానికి ఆమె ఇష్టపడటం లేదని చెప్పినట్టు గుర్తుచేసుకున్నారు. ఆర్జీ కర్‌కి వెళ్లడం తనకి నచ్చటం లేదు అని ఆమె పలు సార్లు చెప్పేదని ఆమె తల్లి అన్నారు. అంతేకాకుండా చనిపోయిన తమ కూతురి ముఖాన్ని చూసే అవకాశం కూడా ఇవ్వలేదు అని.. ఎంత బతిమాలినా కూడా ఆమె ముఖాన్ని చూడనివ్వకుండా దర్యాప్తు జరుగుతోందని చెప్పారు అని వాపోయారు.

బాధితురాలి తండ్రి అసలు తన కూతురిని సెమినార్ హాల్‌లోనే చంపారా లేక వేరే చోట చంపేసి ఆమెను అక్కడికి తీసుకువచ్చారా అని కూడా ప్రశ్నించారు. ఇక ఈ కేస్ లో నిందితులు అందరూ ఎట్టిపరిస్థితుల్లో శిక్ష అనుభవించి తీరాలి అని.. ఇకపై అయినా ఇలాంటివి జారకుండా రక్షణ ఉండాలని కోరుకుంటున్నారు.

Also Read : Bad Cholesterol Level: ప్రతిరోజూ ఉదయాన్నే ఇలా చేస్తే.. నెల రోజుల్లో కొలెస్ట్రాల్ మంచులా కరిగిపోతుంది

Also Read : Gold Rate Today: భారీగా తగ్గిన బంగారం ధర..ఒక్క రోజులోనే రూ. 250 వరకూ పతనం..శనివారం ధరలు ఇవే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News