ఖాప్ పంచాయితీలపై సుప్రీం మండిపాటు

ఇద్దరు మేజర్లు చేసుకున్న వివాహాన్ని ఖాప్ పంచాయితీలు రద్దు చేయడం అక్రమమని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. 

Last Updated : Mar 27, 2018, 02:12 PM IST
ఖాప్ పంచాయితీలపై సుప్రీం మండిపాటు

న్యూఢిల్లీ: ఇద్దరు మేజర్లు చేసుకున్న వివాహాన్ని ఖాప్ పంచాయితీలు రద్దు చేయడం అక్రమమని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది.  ఇవాళ సుప్రీంకోర్టులో ఖాప్ పంచాయతీలపై వాదనలు జరిగాయి.ఖాప్ పంచాయితీల వల్ల జరుగుతున్న హత్యలను అడ్డుకోవాలంటూ ఓ ఎన్జీవో కోర్టులో పిటీషన్ వేసింది. దీనిపై సుప్రీం కోర్టు స్పందించింది.

ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఈ అంశంపై వాదనలు వినిపించింది. చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రాతో పాటు జస్టిస్ ఏఎం ఖాన్‌విల్కర్, డీవై చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఖాప్ పంచాయతీల ఆగడాలను అడ్డుకోవాలని కోర్టు తన తీర్పులో పేర్కొన్నది. ఇందుకోసం ఓ కొత్త చట్టాన్ని రూపొందించి ఆగడాలను నియంత్రిచాలని తీర్పులో వెల్లడించింది. కాగా ఉత్తర గ్రామీణ భారతంలో ఈ ఖాప్ పంచాయితీలు ఎక్కువగా జరుగుతుంటాయి.

Trending News