ఈ దృశ్యం చిన్నదే కావచ్చు. కానీ భయం గొలుపుతోంది. ఈ వీడియో ఒక్కటి చాలు ఒళ్లు గగుర్పాటుకు లోనవడానికి. కేరళ ( Kerala ) లోని ఓ గ్రామాన్ని సముద్రం నీరు ముంచెత్తుతున్న ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు ( Heavy rains ) కురుస్తున్నాయి. కొన్ని చోట్ల వరద దృశ్యాలు చూస్తున్నాం. బంగాళాఖాతంలో ( Bay of Bengal ) ఏర్పడిన అల్పపీడన ప్రభావం (Depression ) తో కేరళ, కర్నాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అటు తీర ప్రాంతాల్లో సముద్రపు అలలు ఎగసిపడుతున్నాయి. ఈ నేపధ్యంలోనే కేరళ రాష్ట్రంలోని కొచ్చి తీర ప్రాంతపు గ్రామ దృశ్యాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
#WATCH Kerala: Water enters in the residential areas of Chellanam, a coastal village in Kochi. pic.twitter.com/dGvaTGIA0x
— ANI (@ANI) July 19, 2020
కొచ్చి ( Kochi Coastal Area ) తీర ప్రాంతంలోని చెల్లానమ్ ( Chellanam Village ) గ్రామం సముద్రానికి ఆనుకుని ఉంటుంది. అల్లకల్లోలమైన సముద్రపు అలలు ఏ విధంగా ఆ చిన్న ఊరిని ముంచెత్తుతున్నాయో చూడండి. కెరటాల ధాటికి వరదలా వచ్చిపడుతున్న నీరు..ఆ ఊరిని ఎలా ముంచేస్తుందో. సముద్రం, ఆ ఊరు రెండూ ఏకమైనట్టుగా కన్పిస్తూ...భయం గొలుపుతోంది ఈ దృశ్యం. Also read: ఢిల్లీ భారీ వర్షాల ప్రభావం: కొట్టుకుపోయిన ఓ ఇల్లు
Kerala: సముద్రం ఆ ఊరిని ఎలా ముంచెత్తుతుందో..