Anti Dowry Policy: కేరళలో వరకట్నానికి వ్యతిరేకంగా వినూత్న నిర్ణయం

Anti Dowry Policy: కేరళ ప్రభుత్వం వరకట్నానికి వ్యతిరేకంగా కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో ఇలాంటి నిర్ణయం తీసుకున్న ఏకైక రాష్ట్రంగా నిలిచింది. గవర్నర్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 26, 2021, 03:59 PM IST
Anti Dowry Policy: కేరళలో వరకట్నానికి వ్యతిరేకంగా వినూత్న నిర్ణయం

Anti Dowry Policy: కేరళ ప్రభుత్వం వరకట్నానికి వ్యతిరేకంగా కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో ఇలాంటి నిర్ణయం తీసుకున్న ఏకైక రాష్ట్రంగా నిలిచింది. గవర్నర్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. 

కేరళ ప్రభుత్వం(Kerala government) వినూత్న నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది.ఇప్పుడు అదే కోవలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. వరకట్నానికి వ్యతిరేకంగా కేరళ ప్రభుత్వం అడుగేసింది. కేరళ ప్రభుత్వంలో పనిచేస్తున్న పెళ్లికాని పురుష ఉద్యోగులు వరకట్నం(Anti Dowry)తీసుకోవడం లేదా ప్రోత్సహించడం చేయకూడదని స్పష్టం చేసింది. ఈ మేరకు పెళ్లయిన నెలరోజుల్లో సంబంధిత విభాగాల అధిపతులకు డిక్లరేషన్ సమర్పించాల్సి ఉంటుంది. ఈ మేరకు సర్క్యులర్ జారీ చేసిన ప్రభుత్వం..ఆ డిక్లరేషన్‌లో భార్య సంతకంతో పాటు వధువు తండ్రి, వరుడి తండ్రి సంతకాలు ఉండాలని తెలిపింది. రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ఇప్పటికే సర్క్యలర్ జారీ చేసింది.

అంతేకాకుండా కేరళలో ఇక నుంచి ప్రతియేటా నవంబర్ 26వ తేదీని వరకట్న వ్యతిరేక దినోత్సవంగా పాటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ రోజు స్కూల్, కళాశాలలు, ఇతర విద్యా సంస్థల విద్యార్ధులు కట్నం తీసుకోమంటూ ప్రతిజ్ఞ చేయాల్సి ఉంటుంది. మరోవైపు వరకట్నానికి వ్యతిరేకంగా విద్యార్ధులంతా డిగ్రీ తీసుకోడానికి ముందు బాండ్ ఇవ్వాలని రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్( Kerala governor) తెలిపారు. ప్రభుత్వంతో పాటు ప్రైవేటు, అటానమస్, ఇతర సంస్థల అధిపతులు కూడా డిక్లరేషన్ తీసుకోవల్సి ఉంటుంది. ప్రతియేటా ఏప్రిల్ 10, అక్టోబర్ 10 కు ముందు సంబంధిత డిక్లరేషన్‌ను జిల్లా వరకట్న నిరోధక అధికారిణికి సమర్పించాల్సి ఉంటుంది.

Also read: Mamata Banerjee: వివాదాస్పద పెగసస్ స్పైవేర్‌పై విచారణకు ఆదేశించిన మమతా బెనర్జీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News