కేరళలో రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టిన మంత్రి థామస్

కేరళ శాసనసభలో ఆర్థిక మంత్రి థామస్ ఇసాక్ ఎల్డీఎఫ్ ప్రభుత్వ బడ్జెట్ ను గురువారం ప్రవేశపెట్టారు.

Last Updated : Feb 3, 2018, 11:06 AM IST
కేరళలో రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టిన మంత్రి థామస్

కేరళ శాసనసభలో ఆర్థిక మంత్రి థామస్ ఇసాక్ ఎల్డీఎఫ్ ప్రభుత్వ బడ్జెట్ ను గురువారం ప్రవేశపెట్టారు. బడ్జెట్ ను ప్రవేశపెడుతూ, ఆర్థికవ్యవస్థపై ఓఖి తుఫాను ప్రభావం పడిందని మంత్రి చెప్పారు. "జీఎస్టీతో కార్పోరేట్లకే లాభం. సామాన్యుడి జేబుకు చిల్లు" అని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న సమయంలో కేరళ బడ్జెట్ 2018 వచ్చింది.

మహిళలకు లబ్దిచేకూరేలా.. మహిళా భద్రతా పథకాల కోసం రూ.1267 కోట్లను కేటాయించింది ఎల్డీఎఫ్ ప్రభుత్వం. న్యాయవాదులు, న్యాయవ్యవస్థలు మరియు పోలీసులందరూ మహిళల సంక్షేమం, భద్రతలో బాగస్వామ్యం కావాలని సూచించారు. పబ్లిక్ హెల్త్ సర్వీసెస్ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.1685 కోట్లు కేటాయించింది. రాష్ట్రంలో ఉబెర్-తరహా అంబులెన్స్ సర్వీసులను పరిచయం చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది.

ఎన్ఆర్ఐల సంక్షేమం కోసం రూ.80 కోట్లు కేటాయించింది. విదేశాల్లో కష్టతరమైన లేదా ప్రమాదకరమైన పరిస్థితులకు ఎదుర్కొంటున్న వారికి రూ.16 కోట్లు కేటాయించారు. ఓఖి తుఫాను ధాటికి విధ్వంసం అయిన తీర ప్రాంత అభివృద్ధికి రూ.2000 కోట్ల రూపాయల ప్యాకేజీని ఆర్థిక మంత్రి ప్రకటించారు. రాష్ట్రంలో మద్యంపై ప్రభుత్వం పన్నును పెంచింది. బడ్జెట్ లో 400 రూపాయల ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కర్ పై  పన్నును 200 శాతం పెంచారు. రాష్ట్రంలో ప్రస్తుతం మద్యం అమ్మకాల ద్వారా రూ.12,000 కోట్ల వార్షిక ఆదాయం లభిస్తుంది.

Trending News