ఐపీఎల్(IPL) ఓ ప్లంబర్ జీవితాన్నే మార్చేసింది. రాత్రికి రాత్రే కోటీశ్వరుడిని చేసింది. క్రికెట్ బెట్టింగ్ యాప్(Cricket Betting App) 'డ్రీమ్ 11'తోనే ఇదంతా సాధ్యమైంది.
అక్టోబరు 10న.. చెన్నై సూపర్ కింగ్స్, దిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన క్వాలిఫయర్-1 మ్యాచ్‌పై బెట్ వేయగా.. అదృష్టం తలుపుతట్టింది. ఏకంగా.. రూ.కోటి(1 Crore) సొంతమైంది. అతడే బిహార్(Bihar)లోని కటిహార్ జిల్లా మనిహారీకి చెందిన బబ్లూ మండల్. బబ్లూ.. హంస్వర్ గ్రామంలో ప్లంబింగ్ పనులు చేసేవాడు. ఈ క్రమంలోనే తనతో పనిచేసే మరో వ్యక్తి ద్వారా డ్రీమ్ 11(Dream11) గురించి తెలుసుకున్నాడు. కొద్ది రోజుల్లోనే అదృష్టం వరించింది. ఈ డబ్బుతో ఇల్లు కట్టుకుంటానని, కొంత మొత్తాన్ని ఓ దేవాలయానికి విరాళంగా ఇస్తానని బబ్లూ చెప్పాడు.
‘‘నాతో పని చేసే వ్యక్తి డ్రీమ్ 11 గురించి చెప్పాడు. నాకు అప్పటి వరకు అసలేం తెలియదు. నా ఫోన్లో ఆ వ్యక్తే యాప్ ఇన్స్టాల్ చేశాడు. కొద్దిరోజుల క్రితమే నేను అది వాడడం మొదలుపెట్టా. మొదట రూ.200 పెట్టాను. ఇప్పుడు ఏకంగా రూ.కోటి గెలుచుకున్నాను. రూ. 30 లక్షలు పన్ను రూపంలో కట్ చేశారు. 70 లక్షలు నాకు వచ్చాయి’’ అని బబ్లూ మండల్ చెప్పాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook