Karnataka Lockdown: కర్నాటకలో కరోనా ఉధృతి, రెండు వారాలు సంపూర్ణ లాక్‌డౌన్

Karnataka Lockdown: కరోనా మహమ్మారి కట్టడికి మరో రాష్ట్రం లాక్‌డౌన్ నిర్ణయం తీసుకుంది. ఎన్ని చర్యలు తీసుకున్నా ప్రయోజనం లేకపోవడంతో చివరికి లాక్‌డౌన్‌నే ఆశ్రయించాల్సి వస్తోంది. ఢిల్లీ, మహారాష్ట్ర సరసన ఇప్పుడు కర్నాటక చేరింది.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 26, 2021, 04:15 PM IST
Karnataka Lockdown: కర్నాటకలో కరోనా ఉధృతి, రెండు వారాలు సంపూర్ణ లాక్‌డౌన్

Karnataka Lockdown: కరోనా మహమ్మారి కట్టడికి మరో రాష్ట్రం లాక్‌డౌన్ నిర్ణయం తీసుకుంది. ఎన్ని చర్యలు తీసుకున్నా ప్రయోజనం లేకపోవడంతో చివరికి లాక్‌డౌన్‌నే ఆశ్రయించాల్సి వస్తోంది. ఢిల్లీ, మహారాష్ట్ర సరసన ఇప్పుడు కర్నాటక చేరింది.

దేశమంతా కరోనా మహమ్మారి అల్లకల్లోలం సృష్టిస్తోంది.రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. కరోనా మహమ్మారి నియంత్రణకు నైట్ కర్ప్యూ(Night Curfew), వీకెండ్ కర్ఫ్యూలు ( Weekend curfew) విధించినా ప్రయోజనం లేకపోవడంతో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ ( Lockdown) విధిస్తున్నాయి. ఇప్పటికే ఢిల్లీ, మహారాష్ట్ర ప్రభుత్వాలు నైట్ కర్ఫ్యూతో ప్రయోజనం లేదని భావించి లాక్‌డౌన్ విధించాయి. ఇప్పుడు ఈ రెండు రాష్టాల సరసన కర్నాటక చేరింది. కర్నాటక( karnataka)లో గత 24 గంటల్లో అత్యదికంగా 34 వేల కేసులు నమోదయ్యాయి. ఒక్క బెంగళూరు నగరంలోనే 20 వేలకు పైగా కొత్త కేసులు వెలుగు చూశాయి. 

ఈ నేపధ్యంలో కర్నాటక ప్రభుత్వం ( Karnataka government) కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 27వ తేదీ నుంచి 14 రోజుల పాటు సంపూర్ణ లాక్‌డౌన్ ( Complete Lockdown) విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి యడ్యూరప్ప ( Karnatka cm yediyurappa)..ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో రేపటి నుంచి 2 వారాల పాటు సంపూర్ణ లాక్‌డౌన్ ఉంటుంది. నిత్యావసర వస్తువులకు మాత్రం ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకూ మినహాయింపు ఉంటుంది. ఢిల్లీ, మహారాష్ట్రల కంటే తమ రాష్ట్రంలో పరిస్థితి భయంకరంగా ఉందని స్వయంగా ముఖ్యమత్రి యడ్యూరప్ప తెలిపారు. అందుకే రానున్న రెండు వారాల పాటు కఠిన ఆంక్షలు విధిస్తామని..మే 1 నుంచి 18 ఏళ్లు నిండినవారందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ( Corona vaccination) ఇస్తామని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఇంటి వద్దనే ఉండి..జాగ్రత్తలు పాటించాలని కోరారు.

Also read: Oxygen Tanker: సరోజ్ ఆసుపత్రి ప్రాణాలు కాపాడిన ఆ ఆక్సిజన్ ట్యాంకర్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News