బాలుడిపై అత్యాచారం.. కంగనా హెయిర్‌స్టైలిస్ట్ అరెస్ట్

బాలుడిపై అత్యాచారం.. కంగనా హెయిర్‌స్టైలిస్ట్ అరెస్ట్

Last Updated : Sep 30, 2018, 11:23 AM IST
బాలుడిపై అత్యాచారం.. కంగనా హెయిర్‌స్టైలిస్ట్ అరెస్ట్

ముంబై పోలీసులు దక్షిణాఫ్రికా జాతీయుడు, బాలీవుడ్ సెలబ్రిటీల హెయిర్‌స్టైలిస్ట్ బ్రెండ‌న్ అటెస్ట‌ర్ డిగీ(42)ను 16 ఏళ్ల బాలుడ్ని అత్యాచారం చేశాడనే ఆరోపణలపై అరెస్టు చేశారు. బ్రెండన్, ఆ బాలుడ్ని ఒక డేటింగ్ యాప్ ద్వారా కలుసుకున్నట్లు.. అతనితో లైంగిక సంబంధాలు కలిగి ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

మ‌హారాష్ట్ర‌లోని రాయ‌గ‌ఢ్‌లో బాలీవుడ్ హీరోయిన్ కంగ‌నా ర‌నౌత్ 'మ‌ణికర్ణిక' షూటింగ్ జరుగుతోంది. ఆమెకి హెయిర్‌స్టైలిస్ట్‌గా వ్య‌వ‌హ‌రించే బ్రెండ‌న్ అటెస్ట‌ర్ డిగీ ఆమెతో పాటే అక్కడే ఉన్నాడు. పోలీసులు షూటింగ్ స్పాట్‌కి వెళ్లి అత‌డిని అదుపులోకి తీసుకున్నారు.

బ్రెండన్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన‌ట్టు తెలుస్తుంది. అక్టోబర్ 3 వరకు ఆయనను కోర్టు రిమాండ్‌కు తరలించినట్టు పోలీసులు తెలిపారు.

16 ఏళ్ల బాలుడు ఓ డేటింగ్ యాప్ ద్వారా పురుషులతో రిలేష‌న్స్ పెట్టుకుంటూ వ‌స్తున్నాడు. ఆ బాలుడు ఒక వ్యక్తితో గదిలో ఉన్నప్పుడు గ‌మ‌నించిన అత‌ని త‌ల్లి తన కుమారుడితో సంబంధాలు ఉన్న మిగితా వ్యక్తులపై కేసు పెట్టింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎనిమిది మంది వ్యక్తులను అరెస్టు చేశారు. వీరిలో బ్రెండన్‌తో పాటు ఓ స్కూల్ టీచర్, వ్యాపారవేత్త ఉన్నట్లు తెలిసింది.

Trending News